ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -9-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
September 13, 2020 • T. VEDANTA SURY • Memories

సాహిత్య అకాడమీ, సదరన్ రీజినల్ ఆఫీసు బెంగళూరు వారు స్పాన్సర్ చేయగా తేదీ 15--09--2013న విశాఖ పౌరగ్రంథాలయములో " బాలల నీతి కథలు " పై గోష్ఠి జరిగింది. అ గోష్ఠికి 18 మంది ప్రముఖులు హాజరయ్యారు.అందులో నేనూ ఒకడిని. ఆ గోష్ఠికి హాజరైనవారు. 1.డాక్టర్.ఎన్. గోపిగారు  2. డాక్టర్ వెలగావెంకప్పయ్య గారు 3. రెడ్డిరాఘవయ్యగారు 4. ఎస్వీ రమణమ్మగారు ( బాలబాటసంపాదకురాలు) 5. డాక్టర్. రావి రంగారావుగారు   6.   గంగిశెట్టి శివకుమార్ గారు 7. చొక్కాపు వెంకట రమణగారు 8. దాసరి వెంకట రమణగారు 9. నారంశెట్టి ఉమామహేశ్వర రావుగారు  10. బెలగాం. భీమేశ్వరరావుగారు11. శివ్వాం  ప్రభాకరం 12. పుట్టగుంట సురేష్ కుమార్ గారు 13. దార్ల
బుజ్జిబాబుగారు 14. డాక్టర్. బెల్లంకొండ నాగేశ్వరరావుగారు 15. ఎన్.కె.బాబుగారు 16. D.K. చదువులబాబుగారు        17. పి. ఎస్.ఎన్ మూర్తిగారు 18. లక్ష్మీ రమణమ్మగారు.ఈ బాలల నీతి కథలు గోష్ఠి జరిగే సమయానికి వందల కొలది బాలగేయాలు, రమారమి వంద కథలు, కవితలువివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈ గోష్ఠికి నన్ను ఎంపిక చేయడం 2006 నుండి 2013 వరకూ నేను బాల
సాహిత్య రంగంలో చేసిన కృషికి ఫలితం దక్కిందని ఎంతో సంతోష పడ్డాను. 15-09- 2013 సమావేశం ముగిసింది.     ఇద్దరు ముగ్గురు స్నేహితులం కలిసి కూర్చొని ఏవో మాట్లాడు కుంటున్నాం. ఇంతలో  గోష్ఠిలో పాల్గొన్న  మాకు టి.ఏ; డి.ఏ లు ఇవ్వడానికి సాహిత్య అకాడమీ ఆఫీసుకు సంబంధించిన వ్యక్తి ఒకరు వచ్చి విజయనగరం జిల్లాలో ఉన్న ఒక బాల సాహిత్య రచయిత తనకు ఈగోష్ఠిలో అవకాశం ఇవ్వకుండామిగిలిన వారికి ఎలా ఇచ్చారు ? తను ఇంతకుముందుసాహిత్య అకాడమీ సమావేశాల్లో అవకాశం ఇచ్చారనీ, ఈ
సారి తనకు అవకాశం ఇవ్వకుండా ఇతరులకు గోష్ఠికి  ఆహ్వానించడం తనకు చాలా బాధగా ఉందని మొరపెట్టు కున్నాడట పాపం ! అందుకు ఆ పిచ్చివానికి, ఈర్ష్యాపరునికివారిచ్చిన సమాధానం ఏమిటో తెలుసండీ ! " మీకు ఒకసారి అవకాశం ఇచ్చాం కదండీ ! అవకాశం ఇచ్చిన వారికే అలా ఇచ్చుకుపోతే మిగిలిన రచయితల సంగతేమిటండీ?"అని సుతిమెత్తగా చీవాట్లు పెట్టి విడిచి పెట్టారట.  ఈ సాహిత్య రంగంలో ఇటువంటి కుళ్ళుబోతులు, ఈర్ష్య, ద్వేషాలతో  కృంగిపోయేవారుంటారు అనుకోలేదు. ఎవరికిఏదైనా సన్మానం, అవార్డు వస్తే మనం సంతోషించాలి. అభినందించాలి. అంతేగాని ఈ జిల్లాలో,  రాష్ట్రంలో,  దేశంలో, ప్రపంచంలో ఉన్న అవార్డులన్నీ నాకే రావాలి.  నాకు తప్ప ఇంకెవరికీ రాకూడదనే భావన ఎవరిలోనూ ఉండకూడదు. అటువంటి వారు నిరంతరం కృంగి కృసించి పోతారు  మనం ఏ రంగంలో ఉంటున్నామో ఆ రంగంలోనున్న పెద్దలు మనల్ని గుర్తించాలి. సన్మానాలు చేయాలి, అవార్డులివ్వాలి. అంతేగాని అవార్డు పొందేవారిని చూసిఏడ్వడం కాదు. అటువంటి ఈర్ష్యా పరులు ఇవతలివారికితెలియకుండా సన్మానం చేసే వ్యక్తులకు, సంస్థలకు ఫోన్ లు  చేసినా, ఉత్తరాలు వ్రాసినా ఆ సంస్థలు ఫలానావాడు మీ విషయంలో ఇలా అంటున్నాడని అవార్డు గ్రహీతకు చెప్పేస్తారు. అప్పుడు ఇవతలి వ్యక్తి స్నేహంగా ఉండి మన నుండిసమాచారాన్ని తెలుసుకొని దెబ్బతీస్తున్నాడని తెలుసుకొనిమనం జాగ్రత్తగా ఉండాలి. ఒకనాడు ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ  నిరంతరం మనం చదువుతూ ఉండాలండీ అంటూ నా అరవై యేళ్ళ వయసులో ముప్పై సంవత్సరాలు వయసున్న వాడొచ్చి నాకు చేసే ఉద్భోధ చేసాడు. మా తాత తండ్రుల నుండీ చదువే మా వృత్తి. పుట్టిన కొద్ది రోజులలోనే అన్నప్రాసనం చేస్తే కలం ,పుస్తకం ముట్టాడా ? కత్తి, బంగారం ముట్టాడా ? అనే  సెంటిమెంట్ తో ఉన్న కుటుంబాలనుండి వచ్చిన నాకు చదువులు, దాని విలువలు  గురించి చెప్పడం చాలా విచిత్రమనిపించింది. ఇటువంటివారి నుండి ప్రమాదం లేదు. తెలిసో తెలియకో చదవమని చెప్పాడు. ఫరవాలేదు. నేను 1967 నుండీ 2003 వరకూ అనేక రచనలు చేసాను.ఇండియన్ ఎక్స్ప్రెస్,
దక్కన్ క్రానికల్ రీడర్స్, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ వార్తల నుండి అభినందనలు తెలుపుతూ లెటర్స్ వచ్చేవి. కానీబాలసాహిత్యంలో రచనలు ప్రారంభించిన తరువాత ఈర్ష్య, ద్వేషాలతో కూడుకున్న మనుషులను చూడ వలసివస్తున్నది. ఇటువంటి విషపూరితమైన, సంకుచితమైన, నీచాతినీచమైన మనస్థత్వాలు ఉన్న మనుషులు సాహితీ లోకంలో ఉన్నందుకు చాలా విచారిస్తున్నాను. జంథ్యాల
పాపయ్యశాస్త్రిగారిలాంటి మహానుభావులు తన తోటి కవులను ఏ విధంగా గౌరవించేవారో చూసి నేర్చుకోండి. " కందుకూరి"  " పానుగంటి"  "కొమఱ్ఱాజు "/ " చిలకమర్తి "" గిడుగు"  " చెళ్ళపిళ్ళ"/ తెలుగు దిగ్గజములు" చిలుకూరి"" వేదము"/లలిత సుగుణజాల! తెలుగుబాల!//అంటారుకరుణశ్రీ. మరో కవిత చూద్దాం. " జడయల్లి జడకుచ్చు లిడరాయప్రోలు / " తల్లావజ్ఘల "  కిరీటలక్ష్మి నింప/ " పింగళి"
" కాటూరి " ముంగురుల్ సవరింప/ " దేవులపల్లి" శ్రీ తిలక ముంప/ " విశ్వనాథ " వినూత్న విధుల కిన్నెర మీట/ " తుమ్మల " రాష్ట్రగాన మ్మొనర్ప/ " వేదుల"  " నాయని "వింజామరలు వేయ/ " బసవరాజు"  " కొడాలి " పదములొత్త / "అడవి"  "నండూరి" భరతనాట్యముల సలుప/"జాషువా"  " ఏటుకూరి "  హెచ్చరిక లిడగ /నవ్యసాహిత్యసింహాసనమున నీకు/ఆంధ్ర కవితాకుమారి! దీర్ఘాయురస్తు//
అని తన సహచరుల గొప్పతనం గురించి వ్రాసారు. కానీ తనే అందరికంటే గొప్పవాడినని ఫీల్  అవ్వలేదు. తను        చేసిన ప్రతీ  రచనకు ఏ పత్రికవాడు ఎంత డబ్బిస్తాడని  బావించడం నీచ నికృష్ట గుణాలు కలిగినవారు  మాత్రమే చెయ్యగలరు. కుఠిల భావాలతో సతమతమై కృంగిపోకండి. ఎదుటివారి అభివృద్ధిని, పురోగతిని కాంక్షించండి. రచయిత లు రచనలు చేయడం పత్రికలకు పంపడం నాలుగుడబ్బులు సంపాదించి బ్రతకడం అది బ్రతుకు కాదు.మనుషులుగా మారండి. మనుషులుగా బ్రతకండి. ముందుగా మీలో ఉన్న  కుళ్ళును  తొలగించుకొని  తరువాతనే  సమాజంలో గల కుళ్ళును తొలగించడానికి కావలసిన రచనలు చేయండి.  ( సశేషం )