ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం 27 (1) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,, ఫోన్: 7013660252.
October 4, 2020 • T. VEDANTA SURY • Memories

బాలసాహిత్యంలో చింతాదీక్షితులు వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీరు 1891 సెప్టెంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా " దంగేరు" గ్రామంలో జన్మించారు. చింతాదీక్షితులు వారి స్వగ్రామమైన దంగేరు లోనే  ప్రాథమిక విద్య సాగింది. రాజమండ్రి ,చెన్నైలో ఉన్నత విద్యను పూర్తిచేశారు. తన చదువు పూర్తి అయిన తర్వాత ఉపాధ్యాయునిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరారు. దీక్షితుల వారు చాలా పొడగరి, శాంత స్వభావం గల వ్యక్తి. నిజాయితీపరుడు. నలుగురిని కలుపుకు పోగల మనస్థత్వం
గలవారు. తన తోటి రచయితల రచనలను చదివి ప్రోత్సహించడమే తప్ప, విమర్శించడం అనేటువంటిది తనకు తెలియదు.యువ రచయితలను ప్రోత్సహించేవారు. 
మనం ఈ విషయాలను దీక్షితుల వారినుండి నేర్చుకోవాలి.
నిత్య జీవితంలో అనునిత్యం మనం పాటించాలి. నేటి రచయితలు సీనియర్ రచయితల జీవిత చరిత్రలను చదవడం, ఇటువంటివి తెలుసుకొని రచయితగా మన 
నిత్యజీవితంలో పాటించడం చేయాలి. ప్రముఖ బాలసాహిత్యవేత్త, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు 
గ్రహీత అయిన చొక్కాపు వెంకటరమణగారు రాసిన 
" బాల సాహితీ వైతాళికులు " లో చింతా దీక్షితులు వారి గురించి చెబుతూ పిల్లల పుస్తకాలలో కొన్ని పెద్దలు చదివి  చెప్పవలసినవి ఉన్నాయి. పెద్దల వివరణతో అవసరం లేకుండా పిల్లలే స్వయంగా చదువుకునేలా పుస్తకాలు రాసిన వారిలో చింతాదీక్షితులు ఒకరనీ, అందుకే ఆయనను “ బాలవాంగ్మయ బ్రహ్మ” అని అంటారని చెబుతారు.  వీరి బంధువు చింతా  శంకర దీక్షితులతో కలసి రచనలు చేసి
నందున జంటకవులుగా వీరిని జంట కవులని పిలిచే వారు.దీక్షితులవారు మొదటిసారిగా " చిత్ర లేఖ" అనే అపరాధ పరిశోధక నవలను రాశారు. తరువాత గేయ కవిత్వాన్ని రాయడాన్ని మొదలుపెట్టి " హరిణ దంపతులు",  " కవి కన్య " గేయాలను ప్రచురించారు. బాలగేయ వాంగ్మయ ముపై మనసు మళ్ళి “ లక్క పిడతలు ” అనే గేయ సంపు టిని ప్రచురించారు. తరువాత కాలంలో కొన్ని నాటికలు, నాటకాలు కూడా వ్రాసి ప్రచురించారు."అనుమానం మనిషి", '' తోటి వనం'' లాంటి రచనలు అనేకం చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. “ ఏకాదశి” అనే కథల సంకలనాన్ని ప్రచురించారు. ఆధునిక కాలం యొక్క సాంప్రదాయాల కన్నా, పురాతన కాలం యొక్క గొప్పత నాన్ని ప్రశంసించేవారు.    “ బాలానందం"  పేరుతో చింతా దీక్షితులు వారు బాలల కోసం అనేక రచనలను చేశారు. ఈ రచనలు పిల్లలను, పెద్దలను ఎంతగానో ఆకర్షించాయి. ఇక దీక్షితుల వారికి ఆధ్యాత్మిక విషయాలలో కూడా అత్యంత పరిజ్ఞానం ఉండేది. " హరనాధ బాబా" అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని ఆంగ్ల భాష నుండి తెలుగు భాషకు తర్జుమా చేసి
"ఉపదేశామృతం" అనే నామకరణం చేశారు.. ( సశేషం )