ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బిళ్ళ గన్నేరు పూలు - ఔషధ విలువలు :- పి . కమలాకర్ రావు
September 7, 2020 • T. VEDANTA SURY • health tips

బిళ్ళ గన్నేరు పూలు మనకు తెలుపు, ముదురు గులాబీ రంగులో వీధుల్లో కనిపిస్తుంటాయి. దీని ఔషధ విలువలు తెలియక ఎక్కువ మంది పట్టించుకోరు . అన్నింటి కన్నా ప్రముఖంగా ఇది, మధుమేహ వ్యాధి తగ్గించడానికి మంచి మూలిక. ఒక ఐదు పూలు తీసుకుని కడిగి నీటిలో వేసి మరిగించి కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. చల్లారిన తరువాత వడపోసుకుని తాగాలి. వరుసగా కొన్ని రోజులు వాడితే మధుమేహ వ్యాధి తగ్గి పోతుంది. ఇది కాన్సర్ వ్యాధి తగ్గడానికి కూడా పని చేస్తుంది. లుకేమియా అనే రక్తం కాన్సర్ తగ్గడానికి వాడుతున్నారు. బిళ్ళ గన్నేరు చెట్టు వేరు భాగాన్ని కడిగి నలగ్గొట్టి నీటిలో వేసి కాషాయం చేసి పుక్కిలిస్తే పంటి చివుళ్ళ వాపు తగ్గుతుంది.