ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బి ఆర్ అంబేద్కర్--కె సృజన్ సింధూర్
November 10, 2020 • T. VEDANTA SURY • News

 నా పేరు కె సృజన్ సింధూర్ నేను సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నాను నేను బి.ఆర్ అంబేద్కర్ గురించి ఈ వ్యాసం రాస్తున్నాను దేశమంటే కొన్ని సరిహద్దులు చూపి దాని మధ్య ఇమిడి ఉన్న భూభాగం అని కాదు అర్థం దేశమంటే ఆ సరిహద్దుల మధ్య నివసించే ప్రజలు అని అర్థం ఇదే విషయాన్ని దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అన్నారు దేశ ప్రజల గురించి ఆలోచించి వారికి ఒక మంచి వ్యవస్థను అందజేయాలని అనుకోవడం దేశంలో నివసించే ప్రతి ఒక్కరి కర్తవ్యం స్వాతంత్ర్య అనంతరం దేశ ప్రజలకు వారందరి అవసరాలు తీర్చే మంచి వ్యవస్థ చట్టం అవసరమయ్యాయి అలా దేశానికి రాజ్యాంగాన్ని అందించిన తత్వవేత్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.

              అంబేద్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 1 14వ తేదీ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా లో జన్మించాడు తల్లి భీమాబాయి తండ్రి రామోజీ maloji అంబేద్కర్.దళితుడు గా పుట్టి అడుగడుగునా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు అంబేద్కర్ తన సోదరుని తో కలసి స్కూల్కి వెళుతుండగా మార్గమధ్యంలో దాహం వేసింది పక్కన ఉన్న ఇంట్లో మంచినీరు ఇవ్వమని అడిగాడు దానికి మీరు అంటరాని వారు మీకు మంచినీళ్లు ఇవ్వకూడదు అని చెప్పింది స్కూల్లో కూడా తోటి విద్యార్థులు అంబేద్కర్ను తమ పక్కన కూర్చో పెట్టుకోవడం కానీ తమతో కలిసి ఆడుకునే ఇవ్వడం కానీ చేసే వాళ్ళు కారు ఈ సంఘటనలతో బాల అంబేద్కర్ చాలా దుఃఖించాడు అంటరాని తనాన్ని నిర్మూలించడానికి అని ఆ నాడే మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు అస్పృశ్యత నివారణ అన్నది ఆయన వయసుతోపాటు ఆరంభించింది బడుగు వర్గాల ప్రజల ఉద్ధరణకు ఆయన కృషి చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నాడు.

             ఎక్కడ బిఏ పాస్ అయిన తర్వాత బరోడా మహారాజు సహాయంతో చదువును పీహెచ్డీ చదువు అమెరికాలో పూర్తిచేశాడు భారత్ తిరిగి వచ్చిన తర్వాత నిమ్నజాతుల ఉద్ధరణ కై mooknayak  అనే పత్రికను ప్రారంభించాడు. నిమ్న వర్గాల ప్రతినిధిగా 1932 లో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు స్వాతంత్ర్యానంతర ప్రభుత్వంలో మంత్రిగా నియమించబడ్డాడు రాజ్య సమితి అధ్యక్షుడు అయ్యాడు తాను రాజ్యాంగాన్ని రచించిన టప్పుడు దళితులు పీడితులు నిమ్న వర్గాల మేలు కొరకు అనేక మార్గదర్శక మార్గదర్శక సూత్రాలను రచించాడు అందరికీ సమాన న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రచించాడు అందరినీ సమానంగా ఆదరిస్తున్న బౌద్ధమతాన్ని స్వీకరించాడు.

            మేధావి న్యాయ శాస్త్ర పారంగతుడు సమాజ సేవకుడు సహృదయుడు సమతా మమతా పూరితమైన మానవతావాది అంబేద్కర్ జాతులు ప్రాంతాలు లేని సమ సమాజ స్థాపన కోసం పోరాడిన అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శం.