ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బొమ్మలు చెప్పిన కమ్మనికథలు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నై :--మరుదినం శుభమహుర్తాన తనపరివారంతో భోజమహారాజు రాజసభలోని చిత్రమండపంలో ప్రవేసించి విక్రమార్కుని స్వర్ణ సింహాసనంపై కూర్చోవాలని మూడుమెట్లు ఎక్కి నాలుగో మెట్టుపై కాలుమోపాగానే,"ఆగు విదర్బరాజా నాపేరు 'మంగళ కల్యాణవళ్లి' ఈధారాపురి ఏలివైన నీవు పండితుడవేకావచ్చు.పదులసంఖ్యలో నీవు గ్రంధాలు రాసి ఉండవచ్చు,చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి,నీపినతండ్రి'మంజుడు'పెంపకింలో గొప్ప పండితుడిగా, మంచి రాజ్యాపాలకుడిగా నువ్వు పేరుపొందడం అభినందనీయమే,కాని విక్రమార్కునితో సరితూగగల అర్హత ఉంటేనే నీవు ఈసింహాసనం అధిష్టించగలవు. ఉజ్జయినీని పాలించే విక్రమార్కుని పేరు,పరాక్రమము, దానము సప్తలోకాలకు తెలిసిపోయింది.ఒక రోజు అష్టదిక్పాల కులతో సభతీరి అప్సరసల నృత్యం చూస్తుండగా,నారదుడు ఇంద్రసభలో ప్రవేసించాడు. సాదరంగా నారదుని ఆహ్వానించాడు ఇంద్రుడు."మహేంద్ర ఈసప్తలోకిలలో గొప్ప నీతికోవిదుడు, .విద్యావిశారదుడు, మహావీరుడు, దాత,ఇతరులకొరకు తనప్రాణాలను సైతం ధారబోయగలిగిన పరోపకారి అయిన ఉజ్జయిని రాజు విక్రమార్కుని మీరుపరిక్షించాలి"అన్నాడు నారదుడు."అవును గతంలో అతని బుద్ధికుశలతకు మెచ్చి నేను స్వర్ణ సింహాసనం బహుకరించాను.అతని దానం,తపస్సు,వీరత్వం,సాహసం పరిక్షింపవలసినదే"అని కామధేనువు(ఆవు)నుపిలిచి"తల్లి మీరు భూలోకంవెళ్లి,విక్రమార్కుని గుణగణాలను పరిక్షించండి"అన్నాడు ఇంద్రుడు. ఇంద్రుని ఆజ్ఞమేరకు కామధేనువు సామాన్య పాడి ఆవులామారివిక్రమార్కుడు ఒంటరిగా ప్రయాణిస్తున్న దారిలో,ఒక బురదగుంటలో నాలుగుకాళ్లు పూర్తిగా చిక్కుకుపోయి,వెలుపలకు రాలేక "అంబా"అని దీనంగా అరవసాగింది.అదారిన వెళుతున్న విక్రమార్కుడు ఆవు అరుపులు విని బురదగుంతలోదిగి ఆవు కొమ్ములు పట్టి వెలుపలకు లాగే ప్రయత్నం చేసాడు.అతనిప్రయత్నం ఫలించలేదు.ఆవు అరుపులు విన్నపులి బురదగుంత సమీపానికి వచ్చింది.కత్తి తీసి పులికి ఎదురు వెళ్లాడు విక్రమార్కుడు.అతని చేతిలో ఆయుధం చుసినపులి దూరంగా వెళ్లి ఆవును చూడసాగింది.తను సమీపగ్రామంలోనికి వెళ్లి ఆవును రక్షించడానికి ఎవరినైనా సహాయంకోసం తీసుకు వద్దాము అంటే,తను లేని సమయంలో ఆవుపై పులి దాడి చేస్తుందని బురదగుంత ఒడ్డునే శిలా ప్రతిమలా చేతికత్తితో నిలబడ్డాడు విక్రమార్కుడు.ఇంతలో ఉరుములు,మెరుపులతో వర్షం ప్రారంభం అయినది. కొంతసేపు చూసిన పులి విసిగి అడవి లోనికివెళ్లి పోయింది.అలా రెండు రోజులు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది.పులి బారిన పడకుండా ఆవును రక్షిస్తూ విక్రమార్కుడుఅలానే నిలబడిఉన్నాడు. అదిచూసిన ఆవు తన నిజరూపంధరించి "రాజా నేను కామధేనువును.నారదమహర్షి కోరిక మేరకు నిన్ను పరిక్షించడానికి వచ్చాను.అమోఘమైన నీదయాగుణం అభినందనీయం.సకల సౌభాగ్యాలతో రాజ్యాన్ని పాలించు"అని "ఏంవరంకావాలో కోరుకో"అంది కామధేనువు."తల్లి నీదీవెనలే చాలునాకు వేరేవరాలు ఎందుకు"అన్నాడు విక్రమార్కుడు."రాజా నామాటలు వ్యర్ధం కాకూడదు. పద నేను నీవెంటవస్తాను"అని విక్రమార్కునితో కలసి ఉజ్జయిని బయలుదేరింది కామధేనువు.దారిలో ఒపేద పండితుడు కనిపించి,విక్రమార్కునిచూసి "నాయనా నేను పదుగురు ఉన్న చోటుకు వెళ్లి పురాణాది విషేషాలు చెప్పి అక్కడ వారు ఇచ్చిన ధనంతో నాకుటుంబాన్ని పోషించుకుంటున్నాను.నేడు నా పురాణకథ వినడాని ఎవరు కనిపించలేదు ఈరోజు నాకుటుంబం ఉపవాసం చేయవలసిందే"అని నిట్టూర్చాడు."పండితోత్తమా తమవంటి పెద్దలకు ఇవ్వడానికి నావద్ద ఈ ఆవు ఉంది దీన్ని తీసుకువెళ్లండి"అని కామధెనువును పండితునికి అప్పగించి ఉజ్జయిని దారి పట్టాడు విక్రమార్కుడు."ఓ భోజరాజా కామధేనువునే దానం చేసిన దానశీలి విక్రమార్కుడు.అతని అంతటి దానగుణం నీలో ఉందా?,ఉంటే నువ్వు మరో మెట్టు ఎక్కు లేదా వెనుతిరిగి వెళ్లిపో"అంది నాల్గవ సాలభంజకం.అప్పటికే మహుర్త సమయం మించి పోవడంతో తనపరివారంతో వెనుతిరిగాడు భోజమహారాజు.
August 9, 2020 • T. VEDANTA SURY • Story