ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు.- డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు, చెన్నై --మరుదినం శుభమహుర్తన భోజమహారాజు తన పరివారంతో రాజ సభలో ప్రవేసించి ముపై రెండు మెట్లు కలిగిన విక్రమాదీత్యునిస్వర్ణ సింహాసనం రెండు మెట్లు ఎక్కి మూడవమెట్టుపై కాలుమోపబోతుండగా ఆమెట్టుపై ఉన్న మూడవ సాలభంజికం 'కోమలవళ్లి' "ఆగు మహారాజా ఈసింహాసనం అధిష్టించాలి అంటే సాహసవంతుడు ,సకలగుణధాముడు అయిన విక్రమార్కుని వీర గాధ చెపుతాను విను....ఉజ్జయిని రాజ్యంలో 'భధ్రసేనుడు' అనే వ్యాపారి ఉండేవాడు.తనికి 'పురంధరుడు'అనే కుమారుడు ఉన్నాడు.భద్రసేనుడి మరణానంతరం ఇతను దుర్వేసనాలకు లోనై ఆస్తిఅంతా పోగొట్టుకోసాగాడు.అతని స్నేహి తుల్లో'ధనదత్తుడు' అనేవాడు పురంధరుని మందలిస్తూ "బుధ్ధిమంతులు ఎవరైనా వయసులో ఉన్నప్పుడు ధనంసంపాదించి,వృధాప్యానికి కుటుంబ అవసరాలకు పొదుపుగా వాడుకోవాలి.చీమలు చూడు తమఆహారాన్ని ఎలా దాచుకుని పొదుపు చేసుకుంటాయో!అని ఎంతచెప్పినా వినకుండా ఆస్తి అంతా పోగొట్టుకుని ఉజ్జయిని రాజ్యం వదలి దేశసంచారంచేస్తూ 'విచిత్రపురం'అనే రాజ్యంచేరి నిర్మానుషంగా ఉన్న రాజబాటలో లోని ఒ ఇంటి అరుగుపై నిద్రించసాగాడు.అర్ధరాత్రి సమయంలో ఆవీధిచివర ఉన్న వెదురు పొదలనుండి ఓస్త్రీ దీన స్వరం'కాపాడండి' 'రక్షించండి' అని రాత్రంతా వినపడుతూనే ఉంది. తెల్లవారి వీధి చివరకు వెళ్లి విచారించగా అక్కడి వారు "అయ్య కొద్దిరోజులుగా ఆవెదురు పొదలనుండి స్త్రీ ఆర్తనాదం వినిపిస్తుంది.పగటి పూట అక్కడికి వెళ్లిచూడగా ,అక్కడ ఏమికనిపిం చడంలేదు.రాత్రులు అక్కడకు ఓ రాక్షసుడు వస్తున్నాడని స్త్రీలను బంధించి అక్కడ హింసిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.ఆకారణంగా రాత్రులు మేము ఆప్రాంతంలో సంచరించడంలేదు"అన్నారు.ఆవిషయం విన్న పురంధరుడు వెంటనే ఉజ్జయిని చేరి విక్రమార్కునికి ఆవిషయం తెలియజేసి తనతో పాటు విక్రమార్కుని తీసుకుని విచిత్రపురం రాజ బాటలోని వెదురు పొదరింటికి చేరువలోని ఒఇంటి అరుగుపై ఇరువురు విశ్రమించారు.అర్ధరాత్రిసమయంలో 'రక్షించండి' 'కాపాడండి'అన్న ఆర్తనాదం వినిపించడంతో,ఆసమయం కోసం ఎదురు చూస్తున్న విక్రమార్కుడు తన ఎడమ చేతిలో కాగడా,కుడి చేతిలో ఖడ్గం ధరించి వెదురు పొదల దగ్గి రకు వెళ్లాడు.అక్కడ కనిపించిన దృశ్యం చూసి గగ్గుర్పాటుతో భయంగా కళ్లు మూసుకున్నాడు పురంధరుడు.అక్కడ ఒక స్త్రీని హింసిస్తున్నాడు రాక్షసుడు."ఆగు దుర్మార్గుడా అబలలపైనా నీవీరత్వం.నువ్వు వీరుడవు అయితే నాతో పోరాడు"అన్నాడు విక్రమార్కుడు."రాజా నేను ఎవరినైనా జయించగలను.నావద్ద ఎన్నో మాయ విద్యలు ఉన్నాయి.నీదారిన నీవు వెళ్లు"అన్నాడు రాక్షసుడు. "రాజు ప్రజలకు తండ్రి వంటి వాడు. దీనులను రక్షించడం ఆర్తులను ఆదు కోవడం రాజధర్మం.కాళీమాత ప్రసాదితమైన ఈ దివ్యఖడ్గం ముందు నీమాయలు పని చేయవు"అంటూ రాక్షసుని తల ఓక్కవేటున తెగవేసాడు విక్రమార్కుడు."రాజా నీసాహసం వలన రాక్షసుడు మరణించాడు,నాశాపం తీరింది.ధన్యురాలిని అంది."అమ్మ మీరు ఎవరు? ఈరాక్షసునికి బంధీగా ఎలాచిక్కారు"అన్నాడు విక్రమార్కుడు. "రాజా ఈరాజ్య సమీపంలోని అరణ్యంలో తపమాచరించే సదానందుని తపోభంగం కలిగించబోయిన దేవకాంతను.ఆయన శాపకారణంగా రాత్రులు ఈరాక్షసునిచే హింసింపబడు తున్నాను.మీచే శాపవిమోచన పొందాను.మీకు పత్యోపకారంగా అపారనిథి ఇక్కడ ఉంది "అనిచెసి ఆస్త్రీ మూర్తి అద్రుశ్యమై పోయింది.పురంధరునికి ఆ అపారనిధి అప్పగించి మంచి మార్గంలో నడుచుకోమని చెప్పి విక్రమార్కుడు ఉజ్జయిని బయలుదేరాడు.పురంధరుడు విక్రమార్కుని సలహా మేరకు సన్మార్గంలో నడు చుకుని గొప్ప దాన శీలిగా పేరు పొందాడు.భోజరాజా వీరుడు అమిత సాహసవంతుడు సకలకళా వల్లభుడు అయిన విక్రమార్గునిలో ఉన్న గుణాలు నీలో ఉంటే పరమేశ్వరుడు ఇంద్రునికి,ఇంద్రుడు విక్రమాదీత్యునికి బహుకరించిన ఈసింహాసనం అధి ష్టించు"అన్నది మూడవ సాలభంజకం. అప్పటికే ముహర్తసమయం మించి పోవడంతో తన పరి వారంతో వెనుతిరిగాడు భోజుడు.
August 5, 2020 • T. VEDANTA SURY • Story