ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బ్రహ్మమానస పుత్రులు.--డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.
October 30, 2020 • T. VEDANTA SURY • Story

తొలుత బ్రహ్మదేవుడు 'సనంద' 'సనక' 'సనాతనులు'అనేవారిని సృష్టించాడు.వారు తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు.అనంతరం మరలా బ్రహ్మ'మారీచి' 'భృగు' 'ఆంగిర' 'పులస్య' 'పులహ' 'కత్రు' 'దక్ష' 'అత్రి' 'వశిష్టుడు' అనే తొమ్మిదిమంది మానస పుత్రులను సృష్టించాడు.అనంతరం 'స్వయంభువమనువు' శతరూపలను సృష్టించి వారికి వివాహానంతరం 'ఉత్తానపాదుడు' 'ప్రియవ్రతుడు'అనేకుమారులు,'ఆకూతి''ప్రసూతి' అనేకుమార్తెలు జన్మించారు.ప్రసూతిని దక్షుడు,ఆకూతిని రుచి వివాహం చేసుకున్నారు.ఆకూతికి 'యజ్ఞుడు' జన్మించాడు.ఇతను' దక్షిణ'ను వివాహంచేసుకున్నాడు.వీరికి పన్నెండు మంది కుమారులు జన్మించారు.వీరిని 'యామాలు'అనుదేవతలుగా గుర్తింపు పొందారు.దక్షుడు ప్రసూతి లకు ఇరవైనాలుగు మంది పుత్రికలు జన్మించారు.వీరిలో మొదటి పదమూడు మంది శ్రధ్ధ-లక్ష్మి-ధృతి-తుష్టి-పుష్టి-మేధ-క్రియ-బుద్ది-లజ్జ-వపుస్సు-శాంతి-సిధ్ధి-కీర్తిలను ధర్ముడు వివాహం చేసుకున్నాడు.మిగిలినవారిలో ఖ్యాతి-భృగువు.సతిని-శివుడు.సంభూతిని-మారీచి.స్ముృతిని-అంగిరసుడు.ప్రీతిని-పులస్యుడు.క్షమను-పులహుడు.సంతతిని-కత్రువు.అనసూయను-అత్రి.ఊర్జను-వశిష్టుడు.స్వాహాదేవిని-అగ్ని.స్వధను పిత్రుదేవతలు వివాహం చేసుకున్నారు.వశిష్టునికి'ఊర్జ అనే మరోభార్యఉంది.ఆమెకు 'రజుడు' 'గోత్రుడు' 'ఊర్థ్వబాహుడు' 'సవనుడు' 'అనఘుడు' సుతవుడు' 'శుక్రుడు'అనేకుమారులు జన్మించారు.వశిష్టుడు అరుంధతికి పలువురు పుత్రులుకలిగారు.వారిలో పెద్దవాడు'శక్తి'ఇతనిభార్య'అదృశ్యంతి'శాపవశాన రాక్షసుడుగామారిన కల్మషపాదుడు శక్తి అతని సోదరులను సంహరించాడు.వశిష్టుని భూదేవి ఓదార్చింది.పరాశరుడు గొప్పతపస్సుచేసాడు.ఓపర్యాయం నదిదాటే సమయంలో పడవనడిపె 'మత్స్యగంధికి' 'వ్యాసుని'సంతతిగా అనుగ్రహించాడు.ఆవ్యాసుడే దృతరాష్ట్ర,పాండురాజు,విదురులకు  దేవరన్యాయంద్వారా జన్మను ప్రసాదించాడు.వశిష్టుడు నిమిచక్రవర్తి శాపకిరణంగా శరీరం నశించడంతో, అప్పుడు 'మిత్రవరుణులు ఊర్వశిని చూసిరేతః పతనంకాగా దాన్ని 'కుంభం'లో దాయగా,దానినుండి వశిష్టుడు,అగస్త్యుడు  పుట్టారు.అందుకే కుంభసంభవుడు'అనేపేరువచ్చింది,బ్రహ్మర్షి విశ్వామిత్రునితొ వైరం అనంతరం,ఇక్ష్వాకు వంశ చక్రవర్తులకు పురోహితుడుగా వశిష్టుడుకొనసాగాడు.