ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బ్రహ్మ మానసపుత్రులలో ఒకరు..కపిల మహర్షి----సుజాత.పి.వి.ఎల్
September 9, 2020 • T. VEDANTA SURY • Story

కపిల మహర్షి తల్లి తండ్రుల పేర్లు కర్దమ ముని, దేవహూతి. తన తండ్రి ఇల్లు వదలి వెళ్ళిన తరువాత కపిలముని తన తల్లి అయిన దేవ హూతికి యోగ శాస్త్రాన్ని అభ్యసించమని విష్ణువుని ప్రార్థించమని, వాటి వలన దేవుని యెడల నిజమైన భక్తి మోక్షము కలుగుతాయని సలహా ఇచ్చాడు.మహాభారతంలో
పేర్కొన్నట్లుగా, ఇతడు ఏడుగురు బ్రహ్మ మానస పుత్రులలో ఒకరు.
విష్ణు పురాణంలో ఇతన్ని మహావిష్ణువు యొక్క అవతారంగా పేర్కొనబడినది. ఇతడు భక్తి యోగంలో ముక్తిని సాధించే ప్రక్రియను బోధించే గురువుగా ప్రసిద్ధులు. సాక్షాత్తు విష్ణువే కపిలుడిగా పుట్టడంచేత కర్దముడు కపిలునితో “నేను యోగసమాధిని అనుష్ఠించి నిన్నుధ్యానం చేసుకుంటూ ఏకాంతవాసానికి తరలిపోతాను. అనుజ్ఞనివ్వు” అని అడిగాడు. అందుకు కపిలుడు, “మునీంద్రా! నా జన్మకు కారణం ఏమిటంటే మునులందరికీ యోగమార్గాన్ని చూపించటమే! అందుకే నేను ఈ లోకానికి వచ్చాను. నీకోరిక మన్నించటం కోసం మాత్రమే కాదు, లోకానుగ్రహ కాంక్షతో నేనుఇక్కడికి వచ్చాను. నా కార్యాన్ని తత్త్వబోధతో కొనసాగిస్తాను. అందరికీ తత్త్వబోధ చేస్తాను. సకల కర్మలలోనూ నీవు సన్యసించి, అంటే నీవు కర్మను వదిలిపెట్టి, నన్నే భక్తితో ఆరాధించు. ముక్తిని పొందుతావు” అన్నాడు.