ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భరతనాట్యం-- జగదీశ్ యామిజాల
September 18, 2020 • T. VEDANTA SURY • Poem

పింఛముంది
ఆడ నెమలికి
భరతనాట్యం!

మాట్లాడే కళ్ళు
సౌంజ్ఞ భాషలు
భరతనాట్యం!

ఇతర భాషకన్నా
మాతృభాష మధురం
భరతనాట్యం!

చూసి ఆస్వాదిస్తే
కలతలు మాయమవుతాయి
భరతనాట్యం!

పాటకు తగినట్లు
పాదం కదపడం
భరతనాట్యం

చేతులూ పలుకుతాయి
కాళ్ళూ పలుకుతాయి
భరతనాట్యం!

జనపదం
జనరంజకం
భరతనాట్యం!

రాగాన్ని ఆస్వాదించొచ్చు
శోకాన్ని మరవచ్చు
భరతనాట్యం!

చైతన్యం పొందొచ్చు
నవ్యత చూడొచ్చు
భరతనాట్యం!