ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భవిష్య వాణి : .. రాజేష్ మిట్టపల్లి .
October 13, 2020 • T. VEDANTA SURY • Story

ఒక రోజు ధర్మరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. బయట కాపలాగా భీముడు ఉన్నాడు లోపల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాల్లో రాజ్య బడ్జెట్, యుద్ధానికి అవసరమయ్యే ఆయుధాల గురించి సమావేశం జరుగుతుంది. ఇంతలో బయటున్న భీముని వద్దకు ఒక ఆగంతకుడు వచ్చాడు భీమసేనా  ఒకసారి బయటకు రావయ్యా అన్నాడు. ఎందుకు అని అతన్ని భీముడు ప్రశ్నించాడు. అప్పుడు ఆగంతకుడు '' కంచే చేను మేస్తుంది''  చూద్దువు రావయ్యా అన్నాడు. అప్పుడు భీముడు చీ ఊరుకో   కంచే చేను మేయడం ఎంటి నేను నమ్మను పొమ్మన్నాడు, కొంత సమయం తరువాత ఆ ఆగంతకుడు మళ్లీ వచ్చాడు భీమసేనా  '' పెద్ద కుండలో నీళ్ళు ఐదు చిన్న కుండలో పోస్తే  సమానంగా నిండాయి, మళ్లీ ఐదు కుండలో నీళ్ళు పెద్ద కుండలో పోస్తే సగమే నిండింది'' ఈ వింతనైన చూడయ్య అన్నాడు. అప్పుడు భీముడు ఇది  నమ్మే విషయం కాదు నేను రాను నువ్వు వెళ్లవయ్య అన్నాడు. మళ్లీ కొంత సమయం తరువాత ఆగంతకుడు వచ్చి భీమసేనా .  '' సుది బెజ్జంలోనుచి ఏనుగు దూరిపోతుంది, చివరకు ఏనుగు తోక సూది బెజ్జలో ఇరుక్కు పోయింది''  ఇదైన చూద్దువు రావయ్యా అన్నాడు. అప్పుడు భీముడు పొద్దటి నుండి పిచ్చి,పిచ్చి కబుర్లు చెపుతున్నా వు , ఇదినేను అస్సలే నమ్మను వెళ్ళి నీ పనిచుసుకో అని సమాధానం చెప్పాడు. మళ్లీ సాయంకాల సమయంలో ఆ ఆగంతకుడు మళ్లీ భీముని వద్దకు వచ్చి భీమసేనా  '' పర్వతం, ఆ పర్వతం మీద పెద్ద బండ్డ రాయ్, ఆ బండ్డా రాయితో ఆ పర్వతాన్ని తొలగించాలని ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు ఒక నులి పోగుతో జపం చేస్తున్నాడు'' , ఒకసారి వచ్చి నీ బలంతో ఆ పర్వతాన్ని తొలగించు అని అన్నాడు. అప్పుడు  భీముడు ఇది నమ్మే విషయం కాదు, సమావేశం ముగిసే  టైమ్ అయింది అన్నగారు పిలుస్తారు మీరు వెళ్ళండి అని సమాధానం చెప్పాడు భీముడు. తరువాత ధర్మరాజు తమ్ముడిని భీముడిని లోపలికి పిలిచాడు అన్నగారికి మంచి నీళ్ళు ఇస్తు అన్నగారు ఇవ్వల ఒక విచిత్రమైన వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఏవో పిచ్చి, పిచ్చి మాటలు అన్నారు అవి నాకు వింతగా అనిపించాయి. అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు అతను ఎలా ఉన్నాడు అని అడిగాడు, దానికి భీముడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. అతను ఏడు, ఎనమిది అడుగులు ఉన్నాడు ఉక్కు, భు జకిర్తులు, ఉక్కు పాదాలు మొత్తం ఉక్కు మనిషిలా ఉన్నాడు.  ఇది విని ధర్మరాజు తమ్ముడు భీమసేనా  వచ్చింది ఎవరనుకున్నవు కలి పురుషుడు, అతను నీకు చెప్పాడు కదా .. అవి జరుగబోయే పరిణామాలు నీకు చెప్పాడు కదా '' కంచే చేను మేస్తుంది '' అన్నవు కదా పాలించవలసిన ప్రభు వులే ప్రజలను భ క్షించుకు తింట్టారు. '' పెద్ద కుండలో నీళ్ళు ఐదు చిన్న కుండలో పోస్తే  సమానంగా నిండాయి,  మళ్లీ ఐదు కుండలో నీళ్ళు పెద్ద కుండలో పోస్తే సగమే నిండింది''  అంటే తల్లి  బిడ్డలకు సమానంగా కడుపు నిప్పుతుంది, కాని బిడ్డలు తిరిగి తల్లికి పెడితే కడుపు సగమే నిండుతుంది అంటే బిడ్డలు తల్లులను సరిగా చూడరు. '' సుది బెజ్జంలోనుచి ఏనుగు దూరిపోతుంది, చివరకు ఏనుగు తోక సూది బెజ్జలో ఇరుక్కు పోయింది'' అంటే పెద్ద, పెద్ద కుంభకోణాలు  చేసినవారు అవలీలగా తప్పించుకుంటున్నారు. కానీ ఆకలి కోసం వంద రూపాయలుదొంగిలిస్తే  వారిపై కేసులు పెడుతున్నారు, ఇదే మన దేశంలో జరిగే దౌర్జన్యాలు అని నీకు ముందే ఆ కలి పుర్శుడు చెప్పాడు అని ధర్మరాజు, భీమునికి చెప్పాడు. 
...