ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భారతదేశం పేదరిక నిర్మూలన-- కె స్వాప్నిక సింధూర్
November 19, 2020 • T. VEDANTA SURY • News

హలో ఫ్రెండ్స్ క్షిపణి శాస్త్రవేత్త భారత ప్రస్తుత రాష్ట్రపతి అయినా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక స్కూలును సందర్శించినప్పుడు భారత దేశానికి నిజమైన శత్రువు ఎవరు అని విద్యార్థులను ప్రశ్నించారు ఎంతోమంది ఎన్నో సమాధానాలు చెప్పారు అందులో స్నేహ kakkar అనే అమ్మాయి పేదరికమే మన ప్రధాన శత్రువు అని జవాబు చెప్పి రాష్ట్రపతిని ఆశ్చర్యపరచింది ఆ సమాధానానికి ముచ్చటపడిన రాష్ట్రపతి తాను రాసిన ఇగ్నైటెడ్ మైండ్స్ అనే పుస్తకాన్ని ఆ అమ్మాయికి అంకితమిచ్చారు దీన్ని బట్టి భారతదేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉన్నదో తెలుస్తుంది భారతదేశంలోని చాలామంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు మన దేశంలో పేదరికం ఎప్పుడు నిర్మింపబడి అప్పుడే దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది కానీ 50 ఏళ్ళ భారత రాజకీయ స్వాతంత్ర్యం పేదరికాన్ని నిర్మూలించి లో వైఫల్యాన్ని పొందింది.
               భారతదేశం పేదరికంలో మగ్గానికి అనేక కారణాలు ఉన్నాయి భారతదేశంలోని 80% గ్రామాల్లోని ప్రజలు వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు వ్యవసాయం కూడా గ్రామాల్లోని ప్రజలందరికీ ఉపాధి కల్పించే లేకపోతోంది వ్యవసాయంలో రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు రైతులు వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి తగిన మార్కెట్ లేక దళారుల బారిన పడుతున్నారు రైతులకు ఒకప్పుడు సరియైన రుణ సదుపాయాలు లేక వడ్డీ వ్యాపారుల వలలో పడి చివరకు వ్యవసాయ కూలీలుగా మారిపోయారు గరీబీ హటావో నినాదంతో భారత తొలి మహిళా ప్రధానమంత్రి అయిన శ్రీమతి ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి రైతులను ఆర్థికంగా ఆదుకున్నారు.
                      భారతదేశం సహజ వనరులు కలిగిన దేశంగా చెప్పబడుతున్న అప్పటికీ ఆ వనరులను సరిగ్గా వినియోగించుకోవడం లేదు ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి పై దృష్టి పెడితే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది ప్రభుత్వం సబ్సిడీల వంటి స్వల్పకాలిక ప్రణాళికల ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలని ప్రయత్నిస్తున్నది కానీ నదుల అనుసంధానం ప్రాజెక్టుల వంటి దీర్ఘకాలిక ప్రణాళికల వలన మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుంది స్వయం ఉపాధి పథకాలను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టాలి గ్రామీణ అభివృద్ధి పథకాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి ఈ విధంగా పేదరికాన్ని నిర్మూలించవచ్చని తెలుస్తున్నది.