ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము* - పద్యం (౪౪ - 44)
November 5, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల : 
*చేరి బలాధికుం డెరిగిఁ | చెప్పిన కార్యము చేయకుండినన్*
*బారము ముట్టలేఁ డొక నె | పంబున దాఁజెడు నెట్టి ధన్యుఁడున్*
*బోరక పాండుపుత్రులకు | భూస్థలి భాగము పెట్టమన్న కం*
*సారిని గాకుచేసి చెడఁ | డాయెనె కౌరవ భర్త  భాస్కరా!*

తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!

బలవంతుడు ఐన వాని వద్దకు ఎవరైనా వచ్చి ఫలానా పని చేయడం వలన నీకు మంచి జరుగుతుంది అని చెప్పినప్పుడు, చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకుని, ఆ పనిని చేస్తే లాభపడతాడు. చేయకపోతే నష్ట పోతాడు. ఎలా అంటే, దుర్మార్గుడు ఐన కంసుని చంపిన శ్రీకృష్ణ పరమాత్మ కౌరవ సభకు వెళ్ళి, ధృతరాష్ట్ర మహారాజు సముఖంలో, దుర్యోధనుని తో తన తమ్ములైన పాండవులకు రాజ్యభాగం ఇవ్వమని, అనవసరమైన యుద్ధం తప్పించమని చెప్పాడు. కానీ ఈ సలహాను వినని దుర్యోధనుడు, యుద్ధంలో రాజ్యాన్ని పోగొట్టుకుని మరణించాడు..... అని భాస్కర శతకకారుని వాక్కు.
*అందుకే, "పెద్దల మాట సద్ది మూట"* అన్నారు.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss