ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము* - పద్యం (౧౦-10)
September 14, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల :
*ఆదర మింతలేక  నరుఁ | డాత్మబలోన్నతి మంచివారికిన్*
*ఖేదము చేయుటం దనదు | పేర్మికిఁ గీడగు మూలమె; ట్ల మ*
*ర్యాద హిరణ్యపూర్వకశి | పన్ దనుజుండు గుణాఢ్యుడైన ప్ర*
*హ్లాదున కెగ్గు జేసి ప్రళ | యంబును బొందఁడె మున్ను  భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురు మూర్తివైన ,భాస్కరా!
పూర్వము హిరణ్యకశిపుడు, అను రాక్షస రాజు, తన బలిమి, భుజశక్తిని చూచుకొని, సద్గుణముల రాశి అయిన తన కుమారుడు ప్రహ్లాదుని కి కీడు చెయ తలపెడతాడు. ప్రహ్లాదుని కి కీడు చేయబోయి, తానే నాశనము అవుతాడు.  కనుక, లోకంలో మనము ఎంత బలవంతులమైనా, ధనవంతులమైనా, మంచి స్వభావం కలిగి, ఇతరులకు మేలు చేసే వారికి ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేస్తే  మనమే నష్ట పోతాము........ అని భాస్కర శతకకారుని వాక్కు.
 *నాకు చాలా డబ్బు వుంది, బలగం వుంది అని అహంకరించి, ఎదుటివారి మంచి గురించి  ఆలోచించకుండా, ఎంత సేపు మంచి స్వభావం గల ఎదుటి వారికి చేటు చేయడానికి ప్రయత్నం చేయడం వలన , అలా అహంకరించిన వారే నష్ట పోతారు* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss