ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము* - పద్యం (౧౧-11)
September 16, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల :
*ఆరయ నెంత నేరుపరి | యై  చరియించిన వాని దాపునన్*
*గౌరవ మొప్పఁ గూర్చు నుప | కారి మనుష్యడు లేక మేలు చే*
*కూర దదెట్లు; హత్తుగడ | గూడునె చూడఁ బదారువన్నె బం*
*గారములోననైన వెలి | గారము కూడకయున్న  భాస్కరా!*
*హత్తుగడ = అతుకుట*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
బంగారముతో నగలు చేయించి, వేసుకుంటే చాలా అందంగా, హుందాగా వుంటుంది. కానీ, ఆ బంగారం గొలుసు రూపంలోకి రావాలంటే వెనిగారం అనే పదార్థం యొక్క సహకారం, తోడు కావాలి. వెనిగారం కలిస్తేనే బంగారు గొలుసు రెండు చివరలు కలుస్తాయి.  అలాగే,  ఎంత నేర్పరి, గౌరవం వున్న వ్యక్తి కి ఐనా వేరొక మంచి స్నేహితుడు తోడైతేనే, మొదటి వ్యక్తి గొప్పతనం తెలుస్తుంది....... అని భాస్కర శతకకారుని వాక్కు.
 *"మనకు పరిచయమైన వారి మంచితనం, గొప్పతనం తెలియాలి అంటే, అతని సన్నిహితుల గురించి తెలుసుకుంటే సరిపోతుంది" అని పెద్దల వాక్కు కదా. సుగ్రీవుడు గుణవంతుడు, ధర్మవంతుడు కూడా. కానీ, మర్యాదా పురుషోత్తముడైన రాముని స్నేహం కలిగే వరకు కష్టాలు పడ్డాడు. మనం మంచి లక్షణాలతో వున్నా, ఆ మంచిని గుర్తించ గలవారు కూడా వుండాలి* అని భావం.
..ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss