ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము* - పద్యం (౧౯-19)
September 24, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల :
*పట్టుపడంగ నేరవు; ని | బద్ధి సురావళిఁగూడి రాక్షసుల్*
*గట్ట పెకల్చి పాల్కడలి | గవ్వము చేసి మధించి రంతయున్*
*వెట్టియె కాక యేమను | భవించిరి వా రమృతంబు భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
దేవతలు, రాక్షసులు కలిసి పెద్ద పర్వతాన్ని సముద్రం లో వుంచి, ఎంతో శ్రమకోర్చి సముద్ర మథనం చేస్తే అమృతం వచ్చింది.  ఆ అమృతం మొత్తం దేవతలకే దక్కింది, కానీ రాక్షసులకు ఒక చుక్క అమృతం కూడా దక్కలేదు. రాక్షసుల శ్రమ అంతా వృధా అయ్యింది.  కారణం, అమృతం పొందే భాగ్యం రాక్షసులకు లేకపోవడమే.  అలాగే, ఈ భూమి మీద మానవులు కూడా ఎంతో శ్రమకోర్చి ఒక పని చేసినా ఆ పని ఫలితం అనుభవించే యోగ్యత వారికి లేకపోతే, ఆ శ్రమ ఫలితం వారికి దక్కదు ...... అని భాస్కర శతకకారుని వాక్కు.
*ఎంతటి కార్య మైనా సఫలం అవ్వాలి అంటే, మానవ మేధస్సు తో కలసిన శ్రమతో పాటు భగవత్ ప్రేరణతో కలసిన అదృష్టం కూడా మను తోడు అవ్వాలి* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss