ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము* - పద్యం (౨౧ - 21)
September 26, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల :
 *ఎడ్డెమనుష్యుఁడేమెరుఁగు | నెన్ని దినంబులు గూడియుండినన్*
*దొడ్డ గుణాఢ్యునందుఁగల | తోరపు వర్తనలెల్లఁ బ్రజ్ఞ బే*
*ర్వడ్డ వివేక రీతి; రుచి | పాకము నాలుకగా కెరుంగునే?*
*తెడ్డది కూరలోఁ గలయ | ద్రిమ్మరుచుండియైన భాస్కరా!*
*ఎడ్డెమనుష్యుడు = మూఢుడైన మనుష్యుడు; తోరపు = మంచివైన*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
 మూఢుడు, మంద బుద్ధి, చెడుగుణములు కలవాడు అయిన వ్యక్తి,  మంచి గుణములు కలిగి సత్ప్రవర్తన తో వున్న వ్యక్తి తో ఎన్నరోజులు కలసి తిరిగినా ఆ మంచి గుణములు మూఢునికి అబ్బవు, రావు.  ఎలాగంటే, మంచి రుచికరమైన పదార్థాల రుచి నాలుకకే తెలుస్తుంది కానీ పదార్థం తయారీలో ఉపయోగించే గరిటకు తెలియదు కదా..... అని భాస్కర శతకకారుని వాక్కు.
*గంధపు చెక్క సువాసన, సానపీటకు పట్టదు కదా* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss