ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము* - పద్యం (౨౪ - 24)
September 29, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల :
 *ఏడ ననర్హుఁడుండు నట | కేఁగు ననర్హుఁడు; నర్హుఁడున్నచోఁ*
*జూడగఁనొల్ల డెట్లన; న | శుద్ధ గుణ స్థితి నీఁగ పూయముం*
*గూడిన పుంటిపై నిలువ | గోరిన యట్టులు నిల్వ నేర్చునే*
*సూడిదఁ బెట్టు నెన్నుదుటి | చొక్కపు గస్తురి మీఁద భాస్కరా!*
*పూయమున్ = చీముతో; పుంటిపై = కురుపు మీద*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
 ఈగ తను సహజ సిద్ధంగా చీము బట్టిన కురుపుల మీద, ఇంకా అశుద్ధము మీద వాలుతూ వుంటుంది.  అటువంటి ఈగ ఎంతో మంచి సువాసన ఇచ్చే కస్తూరి తిలకం నుదుటను పెట్టకున్నా, దాని మీద వాలదు.  ఎలాగంటే, దుర్మార్గులు, చెడుతిరుగుళ్ళు తిరిగేవారు తమవంటి చెడు లక్షణాలు వున్నవారితోనే స్నేహం చేస్తారు కానీ మంచి నడవడిక, లక్షణాలు కలవారి వైపు చూడనైనా చూడరు... అని భాస్కర శతకకారుని వాక్కు.
*"ఏగూటి పక్షి ఆగూటికే చేరుతుంది" అంటారు కదా.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss