ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము* - పద్యం (౨౬ - 26)
October 2, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల :
 *ఒక్కఁడెచాలు నిశ్చల బ | లోన్నతుఁ డెంతటి కార్యమైనఁ దాఁ*
*జక్కనొనర్ప గౌరవు ల | సంఖ్యులు పట్టిన ధేనుకోటులం*
*జిక్కఁగనీక తత్ప్రబల | సేన ననేక శలీముఖంబులన్*
*మొక్కపడంగఁజేసె తుద | ముట్టఛడె యొక్క కిరీటి భాస్కరా!*
*ధేను కోటి = అల/ఆవుల మందలు; శలీముఖంబులన్  = బాణముల చేత*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
 పాండవులు విరాట రాజు కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్న చివరి రోజులలో విరాట రాజు యొక్క ఆవుల సంపదని కొల్లగొట్టాలని దుర్యోధనుడు విరాట రాజు మీదకి పెద్ద సైన్యం తో దండయాత్ర చేసి ఆవులను తరలించుకు పోతాడు. అప్పుడు మహాబలశాలి, దైవానుగ్రహ సంపన్నుడు, గురుకృప కలిగిన అర్జునుడు ఒక్కడే ఆ కౌరవ సైన్యాన్ని తన బాణాల పరంపరతో నిలువరించి, వారిని ఓడించి ఆవులను తిరిగి విరాట రాజుకు సమర్పిస్తాడు. అలాగే ఎంతటి గొప్ప కార్యమైన , చిక్కుముడి ఐనా స్థిరమైన బుద్ధిమంతుడు, బలవంతుడు ఒక్కడే చేయగలడు.... అని భాస్కర శతకకారుని వాక్కు.
*ఏదైనా కార్యసాధనకు కావలసినది బుద్ధి బలంతో కూడిన భుజ బలంకానీ, సంఖ్యా బలం కాదు. ఏదైనా పని మొదలు పెట్టే సమయంలో, ఎంత మంది వున్నాము అని కాకుండా, పనిని సాధించగలవాడు ఒక్కడైనా వున్నాడా అని చూచుకోవాలి* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss