ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - ఒక పరిచయము
September 3, 2020 • T. VEDANTA SURY • News

- తెలుగు భాషా సంస్కృతి లో వేమన, సుమతీ శతకాల తరువాత విస్తృత ప్రచారం లో వున్నది, ఈ *భాస్కర శతకము*.
- దీనిని *దృష్టాంత శతకము* అని కూడా అంటారు.
- ఈ శతక పద్యాలలో కవి, ప్రతీ పద్యం లో కూడా ఏదో ఒక దృష్టాంతం వాడారు.
- ఈ శతక కర్త *"మారన వెంకయ్య"* గారు
- ఈ కతకము లో పద్యాలన్నీ "అ" కారాది క్రమంలోనే వున్నాయ.
- ఈ శతకము లోని పద్యాలు, ఉత్పలమాల, చంపకమాల రీతులలో వ్రాయబడ్డాయి.
- ఈ శతకము లో కవి మారెన వెంకయ్య గారు సార్వకాలికాలైన నీతులు, సామెతలు, జాతీయాలను ఎక్కవగా వాడారు.
- అందువలన ఈ శతకం ౫౦౦(500) సం.లపైన నిలిచి వుంది.
- *తెలుగు వారైనవారు అందరూ, ఈ శతక పద్యాలను సొంతం చేసుకుని, తమ తరువాతి వారికి నేర్పిస్తే, వారందరూ ఉత్తములుగా మలచబడి సంఘానికి ఉపయోగ పడతారు* అనేది కవి *మారన వెంకయ్య* గారి ఆశావహ దృక్పథం.
రేపటి నుండి *మారన వెంకయ్య* విరచిత *భాస్కర శతకము* చదువు కుందాము.
....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss