ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౦౩-03)
September 6, 2020 • T. VEDANTA SURY • Poem

అక్కరపాటువచ్చు సమ | యంబునఁ జుట్టములొక్కరొక్కరి
న్మక్కువ నుద్ధరించుటలు | మైత్రికిఁజూడగ యుక్తమే సుమీ
యొక్కట; నీటిలో మెరక | నోడల బండ్లును, బండ్లనోడలున్
దక్కక వచ్చుచుండుట ని | దానముగాదె తలంప  భాస్కరా !
*అక్కరపాటు = తగిన సమయము*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురు మూర్తివైన ,భాస్కరా ...
మనకు అవసర పడినపుడు మన చుట్టములు సహాయము చేయడము, అలాగే వారికి అవసరమై నపుడు మనము సహాయము చేయడము సహజంగా జరిగే విషయం. ఎలా అంటే, అపసర పడినపుడు నీటిలో ఓడల మీద బండ్లు తీసుకు రాబడతాయి. అలాగే, నేల మీద పెద్ద పెద్ద బండ్ల మీద ఓడలను తరలిస్తారు కదా. ..... అని భాస్కర శతకకారుని వాక్కు.
*ఈ భూ ప్రపంచంలో మానవులు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం సహజ సిద్ధమైన లక్షణం.  మన భారతీయ సంస్కృతి లో అందరూ బావుండాలి,  ఆ అందరిలో మనం వుండాలి అనే కోరుకుంటాము. కనుక మనమంతా అందరికీ సహాయ పడుతూ, పొందుతూ జీవన చక్రాన్ని ముందుగు సాగించాలి*   అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss