ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౦౫-05)
September 9, 2020 • T. VEDANTA SURY • Poem

చంపకమాల :
*అతిగుణవిహీన లోభికిఁ బ | దార్ధము గల్గిన లేక యండినన్*
*మితముగఁగాని కల్మిగల | మీఁదటనైన భుజింప డింపుగా*
*సతమని నమ్ము దేహమును | సంపద, నేరులు నిండి పారినన్*
*గతుకగఁజూచుఁ గుక్క తన | కట్టడ మీరక యెందు భాస్కర!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురు మూర్తివైన ,భాస్కరా ...
కాలువలు, చెరువులు, నదులు నిండుగా పారుతున్నా కూడా కుక్క తన అలవాటు ప్రకారం నాలుకతోనే నీటిని తాగుతుంది కానీ తృప్తి గా కడుపు నిండా తాగలేదు.  అలాగే, ఏమాత్రమూ మంచి గుణములు లేని లోభికి, పిసినారి వానికి సంపద లేనప్పుడు ఎలాగూ సరిగ్గా కడుపునిండా తినలేడు. అదే పిసినారికి అదృష్టం కలసి వచ్చి ఎక్కవ సంపదలు కలిగినా కూడా, తృప్తి గా తినకుండా, తాను, తన సంపదలూ, ఈ ప్రపంచమూ శాస్వతమని నమ్మి ఇంకా ధనం కూడబెట్టాలని చూస్తాడు, తన పిసినారి గుణం కారణంగా....... అని భాస్కర శతకకారుని వాక్కు.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss