ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౧౨-12)
September 17, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల :
*ఈక్షితి నర్ధకాంక్ష మది | నెప్పడు పాయక లోకులెల్ల సం*
*రక్షకుడైన సత్ప్రభుని | రాకలుగోరుదు రెదుఁ; జంద్రి కా*
*పేక్షఁ జెలంగి చంద్రుఁ డుద | యించు విధంబుమకై చకోరపుం*
*బక్షులు చూడవే యెదు ర | పార ముదంబును బూని భాస్కరా!*
*పాయక = విడువక ; చకోరపుం బక్షులు = వెన్నెల పిట్టలు*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
ఈ ప్రపంచంలో, ప్రాపంచిక సంపద మీద కోరిక తీరక, మనుష్యులు అటువంటి ధనమును చక్కగా కాపాడే రాజు రావాలి అని కోరుకుంటారు.  ఎలా అంటే, చంద్రుని రాక కోసం చకోర పక్షులు/ వెన్నెల పిట్టలు ఎదరు చేసినట్టుగా ....... అని భాస్కర శతకకారుని వాక్కు.
 *చంద్రుని కాంతి, చకోరాలకు శాస్వతము కాదు.  ఆలాగే ఈ పాంచభౌతిక మైన సంపదలు మనకూ శాస్వతము కాదు. అందుకని,  'నేను' లో వున్న "నేను" తెలుసుకుని, చిరంతనం, నిత్యం అయిన ఆత్మ తత్వము నకు దగ్గరగా వుండే ప్రయత్నం అందరూ ఎల్లప్పుడూ చేయాలి. భగవంతుని కి ఉపవాసం గా వుండాలి* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss