ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౨౩ - 23)
September 28, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల :
 *ఏగతిఁ బాటుపడ్డఁ గల | దే భువి నల్పునకున్ సమగ్రతా*
*భోగము భాగ్యరేఖ గల | పుణ్యనకుంబలె; భూరిసత్వ సం*
*యోగ మదేభకుంభ యుగ | ళోత్థిత మాంసము నక్కకూన కే*
*లాగు ఘటించు! సింహము ద | లంచినఁ జేకురుగాక! భాస్కరా!*
*ఉత్థిత = పుట్టిన*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
బాగా మదించిన ఏనుగు కుంభస్తలము మధ్యలో వున్న మాంసము ముద్ద సింహమునకు దొరుకుతుంది గానీ, ఎంత ప్రయత్నించినా నక్క పిల్లకు దొరకదు కదా, అలాగే,  ఎంత కష్టపడ్డా, అల్పునకు/చిన్నబుద్ధి కలవానికి సంపదలు దొరకవు, అదృష్టం కలసి వచ్చిన భాగ్యవంతుడికి తప్ప .. అని భాస్కర శతకకారుని వాక్కు.
*మానవ ప్రయత్నానికి తోడు భగవంతుని అనుగ్రహం కూడా తోడైతే, అన్ని సంపదలూ కలుగుతాయి* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss