ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౨౫ - 25)
September 30, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల :
 *ఏల సమస్త విద్యల నొ | కించుక భాగ్యము గల్గియండినన్*
*జాలు ననేక మార్గముల | సన్నుతికెక్క, నదెట్లొకో యనన్*
*రాలకు నేడ విద్యలు తి | తంబుగ దేవర రూపు చేసినన్*
*వ్రాలి నమస్కరించి ప్రస | వంబులు పెట్టరె మీద భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
 ఈ ప్రపంచంలో చదువు లేకపోయినా, పెద్దగా చదువుకోక పోయినా, భగవంతుని అనుగ్రహం వుండి అదృష్టం తోడైన వారు పదిమంది మన్ననలు పొంది, గౌరవ పురస్కారాలు కూడా పొందుతారు. అది ఎలాగంటే, ఈ భూమి మీద వున్న రాళ్ళను ఎవరూ గుర్తించరు. వాటికి ఏవిధమైన విలువ, గౌరవం వుండదు/ఈయరు. కానీ దేవుళ్ళ రూపాలలోకి మార్చబడిన కొన్ని రాళ్ళకు మాత్రమే ప్రజలందరూ ఒంగి ఒంగి దండాలు పెడుతూ, మొక్కులు కడుతూ, అన్ని పూజలూ చేస్తారు కదా అలా.... అని భాస్కర శతకకారుని వాక్కు.
*మన దృష్టి కి కనబడని అతీత శక్తి మీద నమ్మకం వుంచి, మానవ ప్రయత్నం కూడా చేస్తే, పరమేశ్వర అనుగ్రహం తో మనకు దక్కవలసిన ఆనందాలు, మన్ననలు మనవి అవుతాయి* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss