ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౩౩ - 33)
October 14, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల :
 *కారణమైన కర్మములు | కాక దిగంబడ వెన్న గొందులం*
*దూరిన నెంతవారలకు; | దొల్లి పరీక్షిత్తు శాపభీతుఁడై*
*వారధినొప్పు నుప్పరిగ | పైఁబదిలంబుగఁ దాగి యుండినం*
*గ్రూర భుజంగదంత హతి | గూలడె లోకు లెరుంగ భాస్కరా!*
*ఉప్పరిగ పైన్ = మేడపైన*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
 ఎంత గొప్ప వారికైనా, ఎక్కడ దాక్కున్నా గానీ తాము చేసిన పనుల యొక్క ప్రతిఫలం అనుభవింపక తప్పదు.  ఎలాగంటే, పూర్వం పరీక్షిన్ మహారాజు ఒక ముని మెడలో చనిపోయిన పాముని వేసి, తన ఇంటికి వెళతాడు. ఆ తరువాత ఆ ముని కుమారుడు తన తండ్రి మెడలో చనిపోయిన పాము వేసినవాడు, పాముకాటు చేత మరణిస్తాడు అని శపించుతాడు.  ఆ ముని శాపానికి భయపడి, పరీక్షిత్తు,ఎంతో ఎత్తైన ఒంటి స్తంభం మేడ కట్టకుని, దాని చుట్టూ పెద్దగా కందకం తవ్వించి, భాగవత కథలు వింటూ సత్ససంగం చేస్తున్నా కూడా, పాముకాటు తోనే మరణిస్తాడు..... అని భాస్కర శతకకారుని వాక్కు.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss