ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౩౯ - 39)
November 1, 2020 • T. VEDANTA SURY • Poem

చంపకమాల : 
*ఘనుఁడొక వేళఁ గీడ్పడిన | గ్రమ్మర నాతని లేమి బాపఁగా*
*గనుగొన నొక్క సత్ప్రభువు | గాక నరాధము లోపలెందరుం*
*బెనుఁజెరువెండినట్టి తరిఁ | బెల్లున మేఘుడు గాక నీటితోఁ దనుప దుషారముల్ శతశ | తంబులు చాలునటయ్య భాస్కరా!*

తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!

ఒక పెద్ద చెరువు ఎండి పోయినప్పుడు, దానిని తడపడం ఒక పెద్ద మేఘం వల్ల కురిసే వాన నింపగలదు గానీ, నీటి తుంపరలు ఎన్ని జల్లినా, చెరువు నిడదు సరిగదా, తడవను గూడా తడవదు.  అలాగే, ఒక గొప్పవానికి కష్టాలు వచ్చినప్పుడు, ఒక శక్తి వంతుడైన రాజు, అధికారి మాత్రమే ఆతని కష్టాలు తొలగింగలుగుతారు, కానీ సామాన్యుల వల్ల గాదు...... అని భాస్కర శతకకారుని వాక్కు.

*మనలో ఎవరికైనా కష్టాలు కలిగినప్పుడు, సర్వ శక్తిమంతడైన పరమేశ్వర కరుణ కొరకు ప్రార్ధించి, ఆతనికి దగ్గరగా వుంఢే ప్రయత్నం ఎల్లప్పుడూ చేయాలి.  ఎందుకంటే, మన కష్టాలకి, సుఖాలకి కారణం ఆ పరమేశ్వరుడే.  పరమేశ్వరయనుపై, మన ఎదుగుదల కోరే పెద్దవారిపై నమ్మకంతో వుండాలి* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss