ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౪౧ - 41)
November 3, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల : 
*చక్కఁదలంపఁగా విధి వ | శంబున నల్పుని చేతనైనఁ దా*
*జిక్కి యవస్థలం బొరలు | ఁజెప్పగరాని మహాబలాఢ్యఁడున్*
*మిక్కిలి సత్వసంపదల | మీరిన గంధగజంబు మావటీఁ*
*డెక్కి యదల్చి కొట్టి కుది | యించిన నుండదె యోర్చి భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
 ఎంతో బలము గల మత్త గజము మావటి వాడు తన పైన కూర్చుని, అంకుశముతో కొట్టినను, పొడిచిననూ, ఏమీ చేయలేక ఓర్చుకొనును కదా.  అలాగే, బలవంతుడు, బుద్ధిమంతుడూ అయిన మనిషి కూడా దైవం అనుకూలించనప్పుడు, బలహీనుడు, బుద్దిహీనుడి చేతిలో ఇబ్బందులు, కష్టాలు పడక తప్పదు...... అని భాస్కర శతకకారుని వాక్కు.
*అందు వలన, దైవ శక్తి, గరువు యొక్క అనుగ్రహం కోసం మానవుడు నిత్యము పరితపిస్తూ ఉండాలి.  ఆ దైవాన్ని మనం నిత్యం గర్తు వుంచుకునేటట్టు, దైవమే అనుగ్రహించాలని ప్రార్ధన చేయాలి* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss