ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౪౯ - 49)
November 13, 2020 • T. VEDANTA SURY • Poem

చమపకమాల : 
*తనకు నదృష్టరేఖ విశ | దంబుగాఁ గల్గినగాని లేనిచో*
*జనునకు నెయ్యడన్ బరుల | సంపద వల్ల ఫలంబు లేదుగా;*
*కనుగవ లెస్సగా దెలివి | గల్గిన వారికి గాక గ్రుడ్డికిన్*
*కనఁబడునెట్లు వెన్నెలలు | గాయగ నందొక రూపు భాస్కరా!*

తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
కలువ రేకుల వంటి కన్నులు వున్నవారికే వెన్నెల కురిసే అందమైన రాత్రి అందాలు కనబడతాయి, కాని గుడ్డివాడు చూడలేడు కదా.  అలాగే, మన చేతిలో అదృష్ట రేఖలు సరిగ్గా వుంటేనే అదృష్టం మనల్ని చేరుతుంది కానీ , ఎదుటి వాని చేతిలో అదృష్ట రేఖలు వుంటే అదృష్టం అతనినే వరిస్తుంది కానీ మనకు దక్కదు.....అని భాస్కర శతకకారుని వాక్కు. 
*మనం, మన దగ్గర లేని దానికోసం ఎంత అర్రులు చాచినా, ఆశపడినా, మనకు దక్కవలసిందే దక్కుతుంది గానీ, ఆశ పడినంత మాత్రాన అందదు* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss