ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౫౦ - 50)
November 15, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల : 
*తాలిమితోడుతం దగవు | దప్పక నేర్పరి యొప్పుదప్పులం*
*బాలన సేయుఁగా కట ను | పాయవిహీనుడు సేయ నేర్చునే ?*
*పాలను నీరును వేరుపరు | పంగ మరాళ మెరుంగుఁగాని మా*
*ర్జాల మెరుంగునే తదరు | చారు రసజ్ఞతబూన  భాస్కరా!*

తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
పాలను నీరును వేర చేయగల నేర్పరి తనము, మంచి గుణము హంస దగ్గర వుంది కనుక హంస పాలను నీటిని వేరు చేయగలదు.  కానీ పిల్లికి ఆ లక్షణము లేదు. అందువల్ల నీరు కలిపిన పాలు ఇచ్చినా తాగుతుంది తప్ప, పాలు, నీరు వేరు చేయలేదు కదా.  అలాగే,  నేర్పరి, తెలివితేటలు వున్న పాలకుడు, తగవులూ, తప్పిదాలు జరుగకుండా పాలించగలడు. ఎవరినీ నష్ట పరచకుండా తీర్పులు చేయగలడు.  కానీ, తెలివి తక్కవ వాడు, సమయ స్పూర్తి లేనివాడు చేయలేడు .....అని భాస్కర శతకకారుని వాక్కు. 
*మనం నిత్య జీవితంలో కూడా క్షీర నీర న్యాయం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss