ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౫౩ - 53)
November 18, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల : 
*దక్షుఁడు లేని యింటికిఁ | బదార్ధము వేరొకచోటనుండి వే*
*లక్షలు వచ్చుచుండినఁ బ | లాయనమై చను గల్లగాదు, ప్ర*
 *త్యక్షము వాగులున్ వరద | లన్నియు వచ్చిన నీరు నిల్చునే*
*యక్షయమైన గండి తెగి | నట్టి తటాకములోన భాస్కరా!*

తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
వర్షాలు, వరదలు వచ్చినా కూడా, ఆ నీరంతా నిలువ వుండవలసిన చెరువుకు గండిపడుతే, చెరువు నిండదు కదా.  అలాగే, ఇంటి యజమాని మెలకువతో మసలుకోకపోతే ఎంత ధనము సంపాదించినా, ఎన్ని సంభారాలు తీసుకు వచ్చినా అవి ఇంటిలో వుండవు సరికదా, పరులపాలు అవుతాయి.....అని భాస్కర శతకకారుని వాక్కు. 
*మన దగ్గర ఎంత వుంది అని కాకుండా, మనం ఎంత సమర్ధత తో వ్యవహరిస్తున్నాము అనేదే ముఖ్యమైన విషయం* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss