ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౫౭ - 57)
November 22, 2020 • T. VEDANTA SURY • Poem

చంపకమాల : 
*నడవక చిక్కి లేమియగు | నాఁడు నిజోదర పోషణార్థమై*
*యడిగి భుజించుటల్ నరుల | కారయ వ్యంగ్యము కాదు పాండవుల్*
*గడు బలశాలు లేవురు న | ఖండవిభూతిఁదొలంగి భైక్ష్యముల్*
*గుడువరె ఏకచక్రపురిఁ | గుంతియు దారొక చోట భాస్కరా!*

తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
అఖండ బలవంతులు, తేజోవంతులు, ధైర్య సాహసములు చేయగలవారు, కీర్తిమంతులు అయిన పాండవులు, జూద క్రీడలో సర్వము పోగొట్టకుని, తమ కన్న తల్లి కుంతితో కలసి ఏకచక్రపురములో , తమ ఆకలి తీర్చుకోవడానికి భిక్షాటన చేసారు కదా.  అలాగే, పరిస్థితులు మన చేయి దాటి పోయి, కుటుంబ పోషణార్ధం వేరొక దారి తెన్ను కనబడ నప్పుడు,  కుటుంబ ఆకలిబాధ తీర్చడానికి పరులను అశ్రయించడము తప్పు కాదు. అధమమైన చర్యా కాదు .....అని భాస్కర శతకకారుని వాక్కు. 
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss