ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౦౬-06)
September 10, 2020 • T. VEDANTA SURY • Poem

చంపకమాల :
*అదను దలంచి కూర్చి ప్రజ | నాదర మొప్ప విభుండు కోరినన్*
*గదసి పదార్ధ మిత్తురటు | కానక వేగమె కొట్టి తెండనన్*
*మొదటికి మోసమౌఁ బొదుగు | మూలము గోసిన బాలు గల్గునే*
*పిదికినఁగాక భూమిఁ బశు | బృందము నెవ్వరికైన భాస్కర!*
*గదిసి = సమీపించి*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురు మూర్తివైన ,భాస్కరా!
రాజైనవాడు, తన రాజ్యం లో ప్రజలకు కావలసిన ధర్మ బద్ధమైన సౌకర్యాలు కల్పిస్తూ, వారిని తన పాలనవైపు తిప్పకుని, పాలనకు అవసరమైన పన్నులు కట్టమని అడిగితే, ప్రజలు ఆ ప్రభువు వద్దకే వచ్చి అడిగిన ధనం ఇస్తారు. అలా కాకుండా, దౌర్జన్యం తో, తన సైనిక బలగాన్ని వుపయోగించి, పన్నులు వసూలు చేయాలి అనుకుంటే మొదటికే మోసం వస్తుంది.  ఎలా అంటే, మనకు పాలు కావాలంటే, ఆవు వద్దకు వెళ్ళి, నమస్కరించి, పూజించి,  పొదుగు వద్ద పిసికితే సంతోషం గా పాలు ఇస్తుంది. అలాకాక, ఎక్కవ పాలు వస్తాయి అని పొదుగు కోస్తే, ఆవు చనిపోతుంది. మొదటి కే మోసం వస్తుంది........ అని భాస్కర శతకకారుని వాక్కు.
*బంగారు గుడ్డు పెట్టే బాతు కథ, మనకు తెలిసిందే కదా.  అందుకే అన్నరు పెద్దలు - అతి సర్వత్ర వర్జయేత్* అని. 
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss