ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౧౫-15)
September 21, 2020 • T. VEDANTA SURY • Poem

చంపకమాల :
*ఉరుగుణవంతుఁడొడ్లుతన | కొండపకారము సేయునప్పుడుం*
*బరహితమే యొనర్చు నొక | పట్టుననైనను గీడుఁ జేయగా*
*నెరుంగడు; నిక్క మేకద య | దెట్లనఁ ? గవ్వముబట్టి యెంతయున్*
*దరువగ జొచ్చి నం బెరుగు | తాలిమి నీయదె వెన్న భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
ఎదుటి వారు తనకు ఎంత ఎక్కువగా అపకారము/కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, మంచి గుణములు, అలవాట్లు కలవారు ఎప్పటికీ వారికి కీడు/అపకారము చేయడానికి ఇష్ట పడరు సరికదా, మంచే చేస్తూ వుంటారు.  పెరుగును కవ్వంతో  చిలికి ఎంతో కష్ట పెట్టినా, కమ్మని వెన్న యిస్తుంది కదా, అలా....... అని భాస్కర శతకకారుని వాక్కు.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss