ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౩౧ - 31)
October 12, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల :
 *కాని ప్రయోజనంబు స | మగట్టదు తా భువి నెంత విద్యవాఁ*
*డైనను దొడ్డరాజుకొడు | కైన నదెట్లు; మహేశు పట్టి వి*
*ద్యానిధి సర్వ విద్యలకుఁ | దానె గురుండు వినాయకుండుఁ దా*
*నేనుఁగు రీతి నుండియు న | దేమిటి కాడడు పెండ్లి భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
సర్వ విఘ్నాలకు అధిపతి, సర్వ బల సంపన్నుడు, సాక్షాత్ సదాశివుని కుమారుడు, ఏనుగంత బలవంతుడు అయిన గణపతి, వివాహము చేసుకోలేక పోయాడు.  అదే విధంగా, ఎంతటి విద్యావంతులైన, మహారాజు కొడుకైన దైవం అనుకూలించ నప్పుడు, తను సాధించాలి అనుకున్న ఏ పనిని కూడా పరిపూర్ణంగా  సాధించలేరు / పూర్తి చేయలేరు... అని భాస్కర శతకకారుని వాక్కు.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss