ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౩౪ - 34)
October 15, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల :
 *కులమున నక్కడక్కడ న | కుంఠిత ధార్మికుఁ డొక్కఁడొక్కఁడే*
*కలిగెదుఁగాక పెందరచు | గల్గనేరరు; చెట్టచెట్టనన్*
*గలుగఁగ నేర్చునే గొడుగు | కామలు చూడఁగ నాడనాడ నిం*
*పలరఁగ నొక్కటొక్కటి న | యంబునఁ జేకూరుగాక భాస్కరా!*
*పెందరచు = మిక్కిలి ఎక్కవగా ; గొడుగు కామలు = గొడుగు పిడులకు కాబలసిన కర్ర ముక్కలు*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
 గొడుగు పిడులను చేయడానికి పనికి వచ్చే కర్ర ముక్కలు, ఎక్కడ పడితే అక్కడ, ఎక్కవగా దొరకువు.  చాలా అరుదుగా ఈ విధమైన కర్ర ముక్కలు దొరుకుతాయి.  అలాగే, ఒక కులములో లేక వంశములో పుట్టిన వాళ్ళు అందరూ ధార్మికులు కాలేరు. ధర్మ పద్దతి లో నడిచే గుణము కలవారు వంశానికి లేదా కులానికి ఒక్కడు మాత్రమే పుడతాడు..... అని భాస్కర శతకకారుని వాక్కు.
*ఈ భూమి మీద పుట్టిన వారు అందరూ ధార్మిక నడవడిక కలిగి వుండరు.  అదే కనుక సాద్యమైతే, ఈ ప్రపంచంలో ఎందరో పరామాచార్యలు వుండి వుండేవారు.  కానీ పర్మాచార్య ఒక్కరే.  కానీ, పుట్టిన ప్రతి ఒక్కరూ ధర్మం చూపే దారిలోనే నడిచే ప్రయత్నం చేయాలి* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss