ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భూపతి దానం.....డి.కె.చదువులబాబు
September 28, 2020 • T. VEDANTA SURY • Story

శ్రీరంగపురంలో శీనయ్య అనే రైతు కూలీ
ఉండేవాడు.ఆయనకు ఇద్దరు కూతుర్లు.,
నందుడనే కొడుకు ఉన్నారు.శీనయ్యకు నాలుగు ఎకరముల పొలం ఉంది.మంచా
లు అల్లటంలో,గడ్డివాములు.వేయటంలో
నైపుణ్యముంది.పొలం పనులు చూసుకోవటం,తీరిక సమయంలో కూలి
డబ్బుకు మంచాలు అల్లటం,వాములు
వేయటం.చేసేవాడు.నందుడికి చదువు
అబ్బలేదు.శీనయ్య కొడుకును వెంట తిప్పు
కుంటూ,తన విద్యలు,వాటిలో మెలుకువలు
నేర్పాడు.కానీ నందుడు సోమరుల జత
కూడి సోమరిగా తయారయ్యాడు.పని
చేయాలంటే బద్దకించే వాడు.పులిజూదం
లాంటి ఆటలు ఆడుతూ కాలక్షేపం చేసేవాడు.శీనయ్య తన సంపాదనతో
ఇద్దరు కుమార్తెల వివాహం చేసాడు.
        శీనయ్య వయస్సు పైబడటంతో
అనారోగ్యంతో మంచం పట్టాడు.
       తనచివరి క్షణాల్లో కొడుకుతో"నా చివ
రి కోరిక   తీర్చాలి నువ్వు   "అన్నాడు.   
"సులభంగా అనిపిస్తే మాట ఇస్తాను.మాట
ఇస్తే తప్పను నాన్నా!"అన్నాడు.
"పొరుగునున్న నెమళ్ళపాలెంలో భూపతి
అనే జమీందారు ఉన్నాడు.ఆయన గొప్ప
దానపరుడు.ఆయన వద్దకెళ్ళి దానం పొం
దాలి."అన్నాడు.
            తండ్రి కోరిక విని నందుడు చాలా
సంతోషించాడు.జమీందారును అడిగి
దానం తెచ్చుకోవటమేకదా!చాలా చిన్నప
ని అనుకున్నాడు.తండ్రి కోరిక తీర్చుతా
నని మాట ఇచ్చాడు.శీనయ్య చనిపోయా
డు.కర్మకాండలు పూర్తయ్యాయి.
       తండ్రికిచ్చిన మాట నెరవేర్చాలనుకు
న్నాడు.
ఒక శుభముహూర్తాన ప్రయాణమై నెమళ్ళ
పాళెంచేరుకున్నాడు.జమీందారు భవంతి
వద్దకు చేరుకున్నాడు.అక్కడున్న వారిలో
ఒక్కరొక్కరే లోపలికెళ్ళి వస్తున్నారు.కొందరు
ధనంతో బయటకు వస్తున్నారు.కొందరు ఖాళీ చేతులతో వస్తున్నారు. నందుడి వంతు వచ్చింది.లోని కెళ్ళాడు.నమస్కరిం
చాడు.తన వివరాలు చెప్పాడు.తన తండ్రి కోరిక చెప్పాడు.
అంతావిన్న జమీందారు భూపతి" నీవు ఏఏ
పనులు చేయగలవు?"అన్నాడు.
"పొలందున్ని పంట పండించగలను.మంచా
లు అల్లటం,వాములు వేయటం వచ్చు."
చెప్పాడు నందుడు.
    "రెండు సంవత్సరాలు కష్టపడి పంట
పండించు.నీదగ్గరకు వచ్చిన వారికి కాదన
కుండా తీరిక సమయంలో మంచాలు అల్ల
టం,వాములు వేయటం చేయాలి.సంపాదిం
చిన డబ్బు రెండుసంవత్సరాల తర్వాత
తెచ్చి నాకు చూపించు.నీ సంపాదనకు
మూడురెట్లు ధనం  నేనిస్తాను."అన్నాడు
జమీందారు భూపతి.చేసేదేమీ లేక ఇంటి
దారి పట్టాడు నందుడు.
     జమీందారు నుండి దానం పొందటం
కష్టమైన పనని అర్థమయింది. తండ్రికిచ్చిన
మాట నిలబెట్టుకోవాలనుకున్నాడు.
     రెండుసంవత్సరాలు కష్టపడ్డాడు.మంచి
పంట వచ్చింది.మంచాలు అల్లి,వాములు
వేసి బాగా డబ్బు కూడబెట్టాడు.పంటఅమ్మ
గా వచ్చిన ధనం కలిపి ఒక సంచిలో వేసు
కుని వెళ్ళి జమీందారును  కలిసాడు.
     జమీందారు నందుడి డబ్బు తీసుకుని
,ఆ డబ్బుతో నందుడి గ్రామంలో రెండు ఎకరాల భూమినికొని  నందుడికి అప్పగించాడు.మొత్తం భూమి ఆరు ఎకరాలయింది,పంట పండించుకోమని
చెప్పాడు జమీందారు.
    "  అయ్యా!నాడబ్బుతో నాకుపొలం కొని
వ్వడమేంటి?"అన్నాడు  నందుడు.
     "నీకు కష్టపడటం నేర్పటమే నేనిచ్చిన
దానం.మొదటిసారి వచ్చినప్పుడే కష్టపడ టమనే గుణాన్ని నీకు దానంగా ఇచ్చాను.మీ నాన్నఉద్ద్యేశ్యమూ ఇదే.రెండు
సంవత్సరాల కష్టంతో నీవు రెండు ఎకరాల
భూమిని సంపాదించావు.అమూల్యమైన
అవయవాలు,శక్తియుక్తులున్న  నీకు ధనా
న్ని దానంచేయటం మూర్ఖత్వమవుతుంది.
అపాత్రదానం నేను ఎప్పుడూ చేయను.
అంగవైకల్యం కలవారికి,ఆసరాలేని వృద్దుల
కు,జబ్బుతో బాధపడేవారికి గుర్తించి దానం
చేస్తాను.నీలాంటి వారికి గుణాలను దానం
చేస్తాను."అన్నాడు భూపతి.
  "  అయ్యా!రెండుసంవత్సరాలు కష్టపడి
డబ్బు సంపాదించి తెస్తే మూడింతలిస్తాన
న్నారుగా!"అన్నాడు నందుడు.
"ఆరు ఎకరాల పొలం పండించు.మూడిం
త లు సంపాదిస్తావు.కష్టపడకుండా ఏదీరా
దు.  బద్దకం   మనిషికి బద్దశత్రువు.చెడు
సహవాసాలు సర్వనాశనం చేస్తాయి.వాటి ని వదలటం వల్లనే  రెండు ఎకరముల భూ
మిని కొన్నావు.నా వద్దకు రాకుంటేసోమరిగా కాలంగడిపేవాడివి.నీవు కష్టపడేలాచేయటమే నేను నీకిచ్చిన దానం.
మీనాన్న నిన్ను నావద్దకు పంపటంలో
ఉద్ద్యేశ్యమిదే.మీనాన్న కోరిక తీరింది.ఏది సాధించాలన్నా కష్టపడే తత్వం,పట్టుదల,
ఆత్మవిశ్వాసం ఆయుధాలుగా ఉండాలి"
అన్నాడు జమీందారు భూపతి.
   'ఒకమంచి గుణాన్ని దానంగా ఇచ్చాడు.
ఇంతకంటే ఏంకావాలి'అనుకుంటూ ఇంటి
దారి పట్టాడు నందుడు.