ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మంచిమిత్రుడు: -డి.కె.చదువులబాబు--సెల్..9440703716…
November 9, 2020 • T. VEDANTA SURY • Story

కిరణ్ ఐదవతరగతి చదువుతున్నాడు. పాఠశాలలలో ప్రధమశ్రేణి విద్యార్ధిగా గుర్తింపుపొందాడు.
అన్నిపరీక్షల్లోనూ‌ కిరణ్ దే ప్రథమస్థానం.
సహవిద్యార్థి చందు ఎంత ప్రయత్నించినా
రెండవస్థానంలో ఆగిపోయేవాడు.కిరణ్ ను
ఉపాధ్యాయులు ప్రశంసించేవారు.దాంతో
కిరణ్‌కు అహంకారం పెరిగింది. గర్వం తలకెక్కింది.అందరినీ చిన్నచూపు చూసేవాడు. హేళనచేసేవాడు.కిరణ్ ఇంటిపక్కనే చందు ఇల్లు.అర్థంకాని
గణితసమస్యలు,ఆంగ్లంవాక్యాలు అడగటానికెళ్తే కిరణ్ చెప్పేవాడుకాదు.పనివుందని తప్పు
కునేవాడు.
అక్షరాలు సరిగాకుదరటంలేదని ఉపాధ్యాయులు చూచిరాత  పుస్తకాలు ఏర్పాటుచేసారు.
చూచిరాత చక్కగా రాయమని ఉపాధ్యాయులు రోజూ గద్ధించి చెప్పసాగారు.
ఓరోజు‌కిరణుచందుతో ”నీఅక్షరాలు సరిగా వుండవుకదా! నీకునేనురోజూ చూచిరాత రాయిస్తాను, " అన్నాడు.
చందువద్దంటున్నావినకుండా  ఇంటిదగ్గర
బలవంతంగాపుస్తకం లాక్కునిచకచక రాసేశాడు
ఉదయం ఉపాధ్యాయులు చందు పుస్తకం
చూడగానేఅదివాడిరాతకాదని‌ గుర్తుపడతారని చందుని చీవాట్లు పెట్టి శిక్షిస్తారనిభావించాడుకిరణ్.
ఉపాధ్యాయుడు ఫుస్తకం చూడగానే
ఆ అక్షరాలు కిరణ్  వని గుర్తించాడు.చందు రాయవలసిన‍ చూచిరాతను కిరణ్ రాసినందుకు కిరణ్ నుకర్రతో కొట్టబోయాడు.చందు అడ్డుపడి
"ఇందులోకిరణ్ తప్పులేదు.నేనేబతిమలాడి
రాయించుకున్నా!ఇంకెప్పుఢు అలాచేయసార్"అని అబద్ధంచెప్పి దెబ్బలు తిన్నాడు.
అయినా కిరణ్ తనబుద్ధిని ,గర్వాన్ని వదలలేదు,
ఒకసారి పాఠశాలకు నాలుగురోజులు సెలవులువచ్టాయి.ఆసమయంలో వర్షంపడింది.సెలవులతర్వాత పాఠశాల‌ తెరిచారు.తెలుగు ఉపాధ్యాయుడు " ఉక్తలేఖనం చెబుతాను,దూరం
దూరం కూర్చుని‍ రాయండి" అన్నాడు. పిల్లలందరూ దూరంగా కూర్చున్నారు.కిరణ్ ‍గోడవారగాఓమూలకూర్చున్నాడు.అనుకోకుండా కిరణ్
వైపు చూసిన చందు కి‍‍   గోడవారగా  కిరణ్
వైపు వెళ్తున్న పెద్ద తేలు‌ కనిపించింది.ఎక్కడినుండో
వర్షానికి అది లోపలికిచేరినట్లుంది,వెంటనే
పరుగునవెళ్ళి కిరణ్ ని పక్కకు లాగాడు చందు.
తర్వాత తేలును చంపారు.ఆ తేలు కుట్టి వుంటే కిరణ్ ప్రాణం   ప్రమాదంలో‌ పడేది.
కిరణ్ చందు వైపు కృతజ్ఞతగా‍చూశాడు.
" నేను ప్రతివిషయంలో‌ నిన్ను చిన్న చూపు చూశాను.అందరివద్ద గర్వంగా ప్రవర్తించాను.నీచూచిరాత  నేను రాసి నిన్ను కొట్టించాలని చూశాను,
నీవు తె లియని విషయాలు అడిగితే నేను
ఏరోజూ‌‌‌ చెప్పలేదు.అయినా అవేవీ మనసులోపెట్టుకోకుండా‌ నన్ను కాపాడావు.థ్యాక్స్."అన్నాడు కిరణ్,
ఇతరులలోమంచినిచూడటం,చేతనైనసాయంచేయటంమనిషికి సహజలక్షణాలని అమ్మ,నాన్న నేర్పారు." అన్నాడు చందు.
నీమంచితనం,మంచి ఆలోచనలు నాకు ఆదర్శం" అన్నాడు కిరణ్.ఆరోజునుండి కిరణ్ ప్రవర్తన పూర్తిగా‍మారి
పోయింది.----డి.కె.చదువులబాబు. 3/528 వై.యం.ఆర్కాలనీ,ప్రొద్దుటూరు. కడపజిల్లా.