ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే సూప్.: పి . కమలాకర్ రావు
October 25, 2020 • T. VEDANTA SURY • health tips

క్యారెట్ ను  శుభ్రంగా కడిగి సన్నని తురుము గా కోసుకోవాలి. కీర పై పొట్టు తీసి వేసి సన్నని ముక్కలుగా కోసుకోవాలి అలాగే పండిన టొమాటోలను కొన్ని తీసుకొని బాగా కడిగి సన్నని ముక్కలుగా కోసుకోవాలి ఉల్లిపాయలు వెల్లుల్లి ముద్దగా దంచుకోవాలి అలాగే కొన్ని అల్లం ముక్కల్ని పచ్చిమిరప ముక్కల్ని సిద్ధం చేసుకోవాలి ఒక పాత్రలో నువ్వుల నూనె వేసి జిలకర ఆవాలు పచ్చిమిరప అల్లం వెల్లుల్లి ముద్ద తో పోపు వేయాలి ఆ తర్వాత సిద్ధం చేసుకున్నా క్యారెట్ తీరా టమాటో ముక్కల్ని వేసి నీరు పోసి పసుపు కరివేపాకులు వేసి మరిగించాలి రుచి కోసం సైంధవ లవణం వేయాలి కొత్తిమీర వేసి దించేయాలి.  గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. ఇది పిత్థ  వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పొట్టను శుద్ధి చేస్తుంది ఆకలిని పెంచుతుంది .