ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మంచు ముత్యాల రాలేటి చిరు తుంపిరులే చూడర కన్నా! అదిగదిగో సైయ్యాటాలే ఆడేటి చిరు పక్షుల గుంపులే చూడర కన్నా.! వారమ్మలు తెచ్చీ అందించే బువ్వలెలా తింటున్నయో! కిస కి లాడుతూ అమ్మానాకే పెట్టనుచూ ఎంత గమ్మత్తు గా ఆడుచున్నవో చూడర కన్నా! . అదిగదిగో బుర్ర పిట్టలూ తుర్రుమనుచూ ఏగురుతుండెను కోయిలలే వినసొంపుగపాటలేవో పాడుతున్నవి రామసిలుకలు ముద్దు ముద్దుగ ముచ్చట్లేవో వారమ్మతో ముచ్చటించెనూ.! అన్నా కన్నా అదిగదిగో నీటిలో దుంకే చెకుముకి పిట్టలురా! చెంగు చెంగున ఎగిరేటి చేపపిల్లలను నోట కరచుకొన బోవ గిరగిర గిరికీలు కొడుతున్నయ్ పైకి చూడరా! -జయంత్ నమిలకొండ
August 8, 2020 • T. VEDANTA SURY • Poem