ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మట్టి మనిషి..: ---మొహమ్మద్ .అఫ్సర వలీషా--ద్వారపూడి( తూ గో జి )
November 4, 2020 • T. VEDANTA SURY • Poem
  • బాలలూ.....
    మట్టి మనిషి
    తెలుసా మీకు .....
  • మట్టి వాసనకు 
    అలవాటు పడ్డ 
    ముడుతలు పడ్డ  
    దేహంతో ఉంటాడు....
  • అణా పైసా చేతిలో
    లేకపోయినా 
    అరకదున్నటం ఆపడు...
  • మబ్బు తెరలు 
    అంబరాన అణిగినా
    ముఖం చాటేయడం
    తెలియని వాడు.....
  • ప్రకృతి పరిపరి విధాలా పరిహాసమాడినా
    పరిస్థితులకు 
    తలవంచని వాడు....
  • సంధ్య పొద్దుల్లో 
    చెమటను తుడుచుకుంటూ
    సరైన పంట కోసం  
    ఎదురు చూసే
    సాహస వంతుడు......
  • దేహం అలసినా
    దేశం మెచ్చిన 
    మట్టి మనిషతడు...
  • దేశానికి వెన్నెముక 
    అయిన రైతతడు ...!!
  •