ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మణిపూసలు---కవి:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.(విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి (సెప్టెంబర్ 10) సందర్భంగా)
September 10, 2020 • T. VEDANTA SURY • Poem

నందమూరు జననం
అలరించెను కవనం
విశ్వనాథ కవిసామ్రాట్
కీర్తి పొందె గగనం.

* * * * *
జ్ఞానపీఠ్ పురస్కారం
తెలుగు జాతి మణిహారం
వివిధ ప్రక్రియల్లో
చేసెనతడు సంచారం.

* * * *

తెలుగు భాష ప్రియుడతడు
సంస్కృతాంగ్లమున ఘనుడు
వేయిపడగలు మోహనమే
తెలుగు వారి పూజ్యుడతడు.

* * * *

కావ్యాలెన్నో రాసెను
విమర్శలెన్నో చేసెను
విశ్వనాథ మాన్యుడే
తెలుగుకు వన్నెను తెచ్చెను.

* * * *

కిన్నెరసాని పాటలు
కనువిందైన తోటలు
విశ్వనాథుల అక్షరపాణి
సృజించె పూల మాలలు.