ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మత్తడి--ఉండ్రాళ్ళ రాజేశం
September 27, 2020 • T. VEDANTA SURY • Poem

చినుకులన్ని కలిసినయి
వరదలై సాగినయి
కుంటలు చెరువులు నిండినయి
మత్తడులు దుంకినయి
చేపలన్ని ఎగిరినయి
కప్పలన్ని దుంకినయి
కొంగలు జపం చేసినయి
బుడగలు మునిగి తిరిగినయి
ఎండ్రి కాయలు దాగినయి
నీటి పాములు ఉరికినయి
పిల్లలు పెద్దలు నీళ్ళతో ఆడినరు
మత్తడిలో ఈత కొట్టి మురిసినరు
ఆటపాటలతో కనువిందు చేసినరు