ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మధురిమలు--చెన్నమనేని ప్రేమసాగర్ రావు
September 11, 2020 • T. VEDANTA SURY • Poem

అర్ధరేతిరి కాడ
ఆటలేందమ్మా
ముచ్ఛట్ల మురిపాల
మాటలేందమ్మా
లైటు బంధుజేస్తే
పాటలేందమ్మా
మాకు నిధ్దురొచ్ఛె
జోలపాటతోటి
నీకు రాకపాయె
పాటనే సాగంగ
ఆటపాటలతోటి
అలుపు సొలుపులేక
అందాల మాతల్లి
అల్లరే అల్లరి
ఇంటిల్లిపాదికి
సందడే సందడి
బంగారు మాతల్లి
చిన్నారి చిలుక