ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మనసుమాను--కె ఎస్ అనంతాచార్య.-- మొదలు కొస తెలియకుండా శాగవారిన చెట్టు ఊడలపై నుండి ఆనందపు జాడలు వెతుక్కుంటూ వెళ్లే వేర్లు ఈ మహీరుహాని దంతా ప్రత్యేకతే ఏ దేవత నాటిందో దీని విత్తు ఆకులోనే తొడిగింది అహంకారాన్ని చిత్త వృత్తులు ఉద్భవించాయి సహజాతాలై ఈనెల్లో పత్రదళం మందమoతా పేకమేడ మీది రూకల విన్యాసం పెరిగే మొక్క మొదల్లపైన అజమాయిషీ చేస్తూ మోసే వేళ్ళకన్నా ఎదుగుదలకు నిలబడే నేనే మిన్నయంటూ కన్ను గప్పి కవ్విస్తది కాలుజారితే లోకంతో నవ్విస్తది అలకలు, సాధనలు కాండం కణజాలం లో అల్లుకొని ఆత్మీయత ను ఆరగదీసి హారతులు కోరుతుంది కొమ్మలన్ని మర్కట మది స్వభావాలే మొసలి గుండెను కోరే ఎత్తులు చిత్తయినా నక్క వినయాలే పూవులెన్ని జంటల్ని కలిపి కళ్యాణ వీణలు మ్రోగించాయో? ఫలాలు మధురంగా ఉంటాయి పొట్ట విప్పితే పురుగులుండక పోతే సరి ఈ చెట్టు రోగం కుదురాలంటే నీతి ఎరువులు నియతి మందు పిచికారీ చేయాల్సిందే అప్పుడు ఆ వృక్ష చ్చాయలో ఆనందం ఆత్మ లో ప్రవేశించి అద్భుతాల ఆవిష్కారం జరుగుతుంది
August 4, 2020 • T. VEDANTA SURY • Poem