ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మన భారత రాష్ట్రపతి--బెహరా ఉమా మహేశ్వర రావు -సెల్ ఫోన్ నెంబర్:9290061336.
September 1, 2020 • T. VEDANTA SURY • News

బాలలూ! స్వతంత్ర భారత దేశం మనది!గణతంత్ర రాజ్యమే మన జాతి పెన్నిధి! విశ్వమందున అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం.
ద్వితీయ స్థానం అలంకరించే జనస్వామ్యం మన రాజ్యాంగ పరిపాలనాదక్షుడు రక్షకుడు,అతడే అతడు భారతదేశం ప్రథమ పౌరుడు,అతడు సర్వాధికారి రాష్ట్రపతి! దేశాధ్యక్షుడు,ఈ దేశం 13 వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీఇతడు జనియించే 11 డిసెంబర్ 1935 సం:బెంగాల్ రాష్ట్రంలోని బిర్భుం, ప్రాంత "మిరాఠి"జన్మనిచ్చిన గ్రామమునకు వన్నె తెచ్చేనాతడు!తండ్రి కమదకింకర ముఖర్జీ, తల్లి రాజ్యలక్ష్మి,ముద్దుల కుమారుడాతడు, ప్రణబ్ ముఖర్జీపూవు పుట్టగనే సుగంధములు వెదజల్లినట్లు!విద్యా గంధము లు పసితనం నుండి పరిమళించేజర్నలిస్ట్, ప్రొఫెసర్ , పొలిటికల్ లీడరుగ కీర్తినిరాడంబరత,నిబద్ధత,నిజాయితీ,గుణములుదెషేర్దక్ పత్రికా సంపాదకునిగా సత్య వార్తలు రాసే అతని పరమపద  సోపాన పదవుల మూలం1974 లో నౌకాయాన రవాణా ఉప కేంద్రమంత్రీతదుపరి విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రిగా,ఆర్ధిక మంత్రిగా ఘనుడైన పాలకుడు!ప్రపంచం మెచ్చిన ఆర్థిక సంస్కరణల విధానం1982లో నూతన మార్గాన వెలుగులు చూపేవిత్త మంత్రిగ దేశానుద్ధరించిన అపర చాణక్యుడు,అనేక సంక్షోభాల చిక్కుముడులు విప్పెనాతడు,1997 ఉత్తమ  పార్లమెంటేరియన్ మన ముఖర్జీప్రత్యేక తెలంగాణాకు కమిటీ నాయకుడు ఇతడు!ప్రత్యేక తెలంగాణ బిల్లుపై సంతకం పెట్టేనీతడు.
యాదాద్రి ఆలయ నిర్మాణ పరిశీలన చేసి గాంచేఆరు దశాబ్దాల ఉత్తమ ఉన్నత రాజకీయ చరిత్ర!రాజకీయ నందు ఇతడే కలికితురాయి
చట్టసభలలో పారదర్శకంగా మాటాడు వాచస్పతిరాష్ట్రీయ సమాజ్ వాది కాంగ్రెస్ పార్టీ స్థాపించినీతడుచిక్కుముడులు విప్పిన తన రాజకీయ మేధాశక్తిదేశ అవసరాల దృష్ట్యా తన పార్టీని దేశ పార్టీజాతీయ కాంగ్రెస్లో కలిపి తన వ్యక్తిత్వం నిలుపుకునే 2012 సం: రాష్ట్రపతి పదవిని అలంకరించేతెచ్చె కదా రాష్ట్రపతి భవన్ జనం అందుబాటునఅరువది సంవత్సరముల నిజాయితీ ఉట్టి పడిన
రాజకీయ జీవితాన ఎన్నెన్ని పదవులో అలంకరించేబెంగాల్ రాష్ట్రాన పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైఉన్నత పదవులు అనేకము నిష్టగా అధిష్టించేభార్య సువ్రా ముఖర్జీ  తోడు  నీడై నిలచేనాడు!2008సం: పద్మవిభూషణ వేర్ ఇస్ ద మన పొందే2019సం: భారత రత్న బహుమతి నీతడు పొందేతే31-08-2020దీన ఆర్మీ ఆసుపత్రి నందుకడ శ్వాసవిడిచిన మీకు ప్రణామములు, జై హింద్!!ప్రధాని మోది మాటలలో: దేశం గొప్ప రాజనీతిజ్ఞునికోల్పోయింది.ఒక తరం నేతను కోల్పోయింది, దేశానికి ఎన్నో రకాల సేవలందించాడు:రామనాథ్ కోవింద్.ఈయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారుఉపరాష్ట్రపతి ఎం,వెంకయ్య నాయుడు గారుసోనియా, రాహుల్ గాంధీ ఆయన మరణానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.దేశానికి అనేక సేవలందించిన నేత: తెలంగాణ ముఖ్యమంత్రి, కే .చంద్రశేఖర్జీవితంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్న రాజకీయ నిపుణుడు:ఆంధ్ర ప్రదేశ్  ముఖ్య మంత్రి వైయస్ జగన్.ఆయన లేని  లోటు తీర్చలేనిది: నారా చంద్రబాబు నాయుడు.ఈ మహా నాయకునికి ఉభయ రాష్ట్రాల రాష్ట్ర గవర్నర్లు మరియు యు ఇతర నాయకులు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.