ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మబ్బులు--రచన:-డా.గౌరవరాజు సతీష్ కుమార్.
August 24, 2020 • T. VEDANTA SURY • Poem

మబ్బులు మబ్బులు
పాలనురుగులు
దూదిపింజెలు
నింగిలో మబ్బులు!!

తెల్లని మబ్బులు
నల్లని మబ్బులు
నింగిలో మబ్బులు!!

వానకు ఉండును
ఎండకు పోవును
నింగిలో మబ్బులు!!

అపుడే వచ్చును
అపుడే పోవును
నింగిలో మబ్బులు!!