ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మలుపు :--కె ఎస్ అనంతాచార్య.
October 26, 2020 • T. VEDANTA SURY • Poem

బేతాల కథలోనీ ట్విస్టు  మార్పులకు లోనై ఎవరెస్టునుoడి పాతా లానికి చేర్చే తంత్రం 


పరిస్థితులకు స్పందించి 
అసమర్థతను అధిగమించి
ముందుకెడితేనే కొత్త చరిత్ర
 పురుడు పోసుకుంటుంది

తప్పును గ్రహించి పశ్చాత్తాపపు దారి లోంచి జాలు వారే  జ్ఞాన కిరణం

ఎండ  వానలో తడిసి ఇంద్రధనస్సును చూసి ఎక్కుపెట్టే కవితా ధనస్సు  కవి మేధా తపస్సు

తళుక్కున మెరిసిన ఉపాయం  గండం నుండి గట్టెక్కించే తరుణోపాయం

పొట్టకొచ్చిన వరి మీద
 కురిసిన అకాల వర్షo 
కరుణ లేని  కరోనాలా రైతు ఆశను కోసేసింది

కుట్రలు కుం తంత్రా లతో అడుగడుగునా గుండె గాబర పెట్టే టీ వీ సీరియళ్లు గాలిలో తేలే  జీవితాలు

మామూలు మనిషియైన కరంచంద్ ని హరిశ్చంద్రుని కథయే కదా మహాత్మునిగా నిలబెట్టింది

చేయి పట్టి నడిపించే స్నేహమే కదా విజయo మెట్లమీద  నిలబెట్టిoది 

సుడి గుండంలో చిక్కుకు పోయినప్పుడు ఒడ్డుకు చేర్చే నావయే పునర్జన్మ నిచ్చేది

తెలుపకుండా వచ్చి తెలివితో యుద్ధం నుండి తప్పించి గెలుపు నిచ్చేదే మలుపు