ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మహిళలు - జాగ్రత్తలు - ప్రమోద్ ఆవంచ
September 1, 2020 • T. VEDANTA SURY • Serial

మహిళలు కొరనరీ అర్టరీ జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.పట్టణాలలో ఉద్యోగాలు చేసే మహిళలకు ప్రధానమైన సమస్య ఒత్తిడి.ఇంటా బయట పని చేస్తూ విరామం లేకుండా వుండడం వల్ల మానసికంగా వాళ్ళు ఎంతో ఒత్తిడికి గురికావడం జరుగుతుంది.ఈ ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి.ఒత్తిడితో గుండెలో ఆర్టరీస్ బిగుసుకపోతాయి, దానివల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు వస్తాయి.కొరనరీ మైక్రో వాస్కులార్ జబ్బు వస్తుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్య కరమైన ఆహార నియమాలు పాటించాలి.మహిళలలో పొగ తాగే అలవాటు వుంటే మానుకోవాలి.మధుమేహం రాకుండా జాగ్రత్త పడాలి.కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో వుంటాయి.షుగర్, ఉప్పు లను తక్కువగా తీసుకోవాలి.
 బీపీ, షుగర్ ఉన్న వారు ఆహార నియంత్రణతో పాటు రోజు తప్పనిసరిగా డాక్టర్లు సూచించిన మందులను విధిగా వాడాలి.ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే,హై బీపీ, షుగర్,హై కొలెస్ట్రాల్ వున్న ప్రతి ఒక్కరికీ గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.మిగితాది రేపు.