ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మాస్క్--కె ఎస్ అనంతాచార్య-- ఇప్పుడు దీనిమీదనే ప్రపంచ ప్రయాణమంతా! పలకరింపు ప్రశ్నార్థక మైన వేళ గుర్తింపు అంతా శబ్దబేధి విద్యపైనే భావోద్వేగాలన్నీ బాధల అంచులు దాటి కళ్లలోంచి పెల్లుబుకుతాయి! విరుపులు మధుర వచనాలు మాస్కు చాటు మాటలే ఇక! ఫేస్,ఇండెక్స్.. ఇక చరిత్రే ప్రస్తుతం కళ్ళు అన్ని భాష లూ మాట్లాడాలి చేయి సైగ లే రాబోవు సమాచార వినిమయ మాధ్యమాలు నవ్వు కనపడితే ఒక్క సారి పదుల కొద్దీ సూర్యుల తో భళ్ళున తెల్లారినట్లు ఉంటుంది మెలేసే మీసాలు లేవు సంపెంగ నూనెల వాసనల్లేవు కోవిడ్ కాటుకు బలికావద్దంటే రక్షణ కవచంలోకి ముడుచుకొగలిగే కూర్మావతారులం అవాల్సిందే మాస్కులు మాట్లాడు కుంటున్నాయి యుద్ధం అంతమయ్యేది ఎప్పుడని? ముద్దు ముఖారవిoదా లు విప్పారేదెప్పుడని?
August 18, 2020 • T. VEDANTA SURY • Poem