ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మా రైతన్న:-రచన : రావిపల్లి వాసుదేవరావుల,పార్వతీపురం 9441713136.
September 22, 2020 • T. VEDANTA SURY • Poem

రైతన్నా మా రైతన్నా
కష్టజీవి మా రైతన్నా
రేయిపగలనక కష్టపడి
పంట పండించే రైతన్న

వేకువఝామునే నిద్రలేచి
నాగలితో దుక్కినిదున్ని
విత్తనాలను వొడుపుగజల్లే
శ్రమజీవీ మా రైతన్నా

నిత్యం తాను పొలంలో వుండి
నారునుపోసి నీరునుకట్టి
నాట్లు నాటి గాబును తీసే
కనబడుదైవం రైతన్నా

అవసరమైన ఎరువును వేసి
తెగుళ్లతో పోరాటం చేసి
బంగరుపంటను పండించేటి
దేశసేవకుడు రైతన్నా

కొడవలితోను పంటనుకోసి
కళ్ళంచేర్చి నూర్పిడి చేసి
పంట సిరులనింటింటకి చేర్చి
కూడు పెట్టు మా రైతన్నా

దేశానికి రైతే వెన్నెముక
కాదనలేము దీన్నింకా
రైతుకు సాటి లేరు ఇకా
ఎప్పటి కతడే రాజింకా